చాలామంది రోజు తినే హెల్తీ ఫుడ్‌లో పెరుగు ఒకటి. మనం తినే భోజనం ఎంత మంచిగా ఉన్నా చివరిలో పెరుగన్నం లేకపోతే భోజనం సంపూర్ణం కానట్టే ఉంటుంది. రోజు పెరుగు తినడం వల్ల కాల్షియం, విటమిన్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే పెరుగన్నం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహార కావడంతో పెద్దలు, పిల్లలు అందరూ దీన్ని తినవచ్చు. పెరుగు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగుతో మనం బ్యూటీ టిప్స్ పాటిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి.
1. రోజు గడ్డ పెరుగు ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత కోల్డ్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే స్కిన్ కి తగినంత తేమ లభిస్తుంది. చలికాలం చర్మం పొడి భారే సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
2. ఎండవేడికి కొంతమందికి చర్మం కమిలిపోతుంటుంది. అలాంటివారు చర్మానికి పెరుగు రాసుకుంటే వెంటనే చర్మం గతంలోలా నిగనిగలాడుతుంటుంది.
3. ప్రతిరోజు పడుకునే ముందు పలుచటి క్లాత్ తో మజ్జిగ పూతను ముఖానికి 10 నిమిషాలకు 3 నుంచి 4 సార్లు అప్లై చేసుకుని.. ఆ తర్వాత నీటిలో పల్చటి గుడ్డను ముంచి ముఖాన్ని తుడుచుకోండి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.
4. మొటిమలు ఎక్కువగా ఉన్నవారు పెరుగులో శనగపిండిని కలుపుకుని ముద్దలా చేసి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది.