టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు కృష్ణ. 300లకు పైగా సినిమాల్లో నటించిన కృష్ణ డైరెక్టర్‌గా కూడా మంచి సక్సెస్ సాధించారు. 1996లో ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ఖైదీ రుద్రయ్య సినిమా సూపర్ హిట్ కావడంతో అదే సంవత్సరంలో కే .బాపయ్య దర్శకత్వంలో కృష్ణ – శ్రీదేవి కాంబోలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మరో సినిమా జయం మనదేరా. ఈ సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
ఇక ఇదే టైటిల్ తో ఆ తర్వాత తరం నుంచి ఓ స్టార్ హీరో సినిమాను తెరకెక్కించి ఘనవిజయాన్ని సాధించాడు. ఆయన ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ ఆచితూచి కథలను ఎంచుకుంటూ ముందడుగు వేస్తున్నాడు. ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించాడు. కుటుంబ నేపథ్యం ఉన్న కథలతో ఎక్కువ సక్సెస్ సంపాదించుకున్నాడు.
ఇలా భానుప్రియ, సౌందర్య హీరోయిన్లుగా తెరకెక్కిన జయం మనదేరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆహుతి ప్రసాద్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, అలీ, ఏవీఎస్, ఝాన్సీ, రామా ప్రభ ఈ సినిమాలో కీరోల్ ప్లే చేశారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజై అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఘనవిజయం సాధించి ఎప్పుడు గుర్తుండిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలలో జయం మనదే రా ఒకటి.