మెగాస్టార్ చిరంజీవి తన మూడున్నర దశాబ్దాల కెరీర్ లో 150 కు పైగా సినిమాలలో నటించారు. ఇన్నేళ్ల కెరీర్లో ఇన్ని సినిమాలలో నటించిన చిరంజీవి ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించారు. పాతతరం హీరోయిన్లలో రాధిక, నళిని, శ్రీదేవి ఆ తర్వాత తరం హీరోయిన్లలో రాధ, విజయశాంతి 1990వ దశకం తర్వాత నగ్మా, వాణి విశ్వనాథ్, రంభ, రోజా, రమ్యకృష్ణ ఎంతో మంది హీరోయిన్లతో నటించారు.
సిమ్రాన్, సాక్షి శివానంద్, ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే, సౌందర్య, మీనా లాంటి హీరోయిన్లతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కొట్టారు. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ తరం జనరేషన్ హీరోయిన్లు తమన్నా, నయనతార కాజల్తోను జట్టు కట్టారు. వాల్తేరు వీరయ్య సినిమాలో శృతిహాసన్ తోను జోడి కట్టారు.
ఇలా ఎంతోమంది హీరోయిన్లతో నటించిన చిరుకు ఎప్పుడు ఏ హీరోయిన్ నుంచి ఇబ్బంది ఎదురవలేదట. అయితే ఒక హీరోయిన్ మాత్రం చిరునే టెన్షన్ పెట్టేసింది అట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు రాధ. చిరంజీవి డ్యాన్సులకు పెట్టింది పేరు. ఆయనతో పోటీపడి డ్యాన్సులు వేయాలంటే హీరోయిన్లకు సాధ్యం కాదు.
అయితే రాధ మాత్రం ఒక్కోసారి చిరంజీవి గ్రేస్ ను మించి మరి డ్యాన్స్ చేసేదట. డైరెక్టర్ కానీ.. డ్యాన్స్ మాస్టర్ కానీ ఏదైనా ఒక స్టెప్ చెప్పినప్పుడు రాధ క్షణాల్లో రెడీ అయిపోయే వారట. అదే చిరంజీవికి కనీసం రెండు నిమిషాల టైం కావాల్సి వచ్చేదట. అలాంటి టైంలో రాధ స్పీడ్ ఆ గ్రేస్ చూసి ఒక్కసారి తనకే టెన్షన్ వచ్చేదని చిరంజీవి స్వయంగా చెప్పారు. అలా తన కెరీర్ మొత్తం మీద రాధా తన పక్కన నటించే టైంలో తను చాలా ఎలెర్ట్గా ఉండాల్సి వచ్చేదని చిరు చెప్పారు.