హీరోయిన్ జ‌య‌చిత్ర‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మోసం టాలీవుడ్ హీరో…!

జ‌య‌చిత్ర తెలుగు సినిమా రంగంలో పాతతరం హీరోయిన్లలో గొప్ప నటిమని. 1970వ ద‌శ‌కంలో ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలలో నటించి మంచి హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. జ‌య‌చిత్ర చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె తమిళంలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఒకరిద్దరూ హీరోలు జ‌య‌చిత్ర అందానికి ఫిదా అయ్యి ఆమెకు దగ్గర‌య్యేందుకు ప్రయత్నించే వారట.

అయితే ఆమె మాత్రం ఎవరిని కూడా అలాంటి విషయాలలో ఎంకరేజ్ చేసేవారు కాదని.. అసలు తన దగ్గరికే రానిచ్చేవారు కాదని అప్పటి సినీ విశ్లేషకులు చెబుతుండేవారు. అయితే టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఉన్న సుధాకర్ అప్పుడే యువకుడిగా తమిళ‌ సినిమాలలో నటించడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే జ‌య‌చిత్ర అందాన్ని చూసి ముగ్ధుడు అయిపోయాడు. సుధాకర్ ఆమెకు లేనిపోని మాటలు చెబుతూ బాగా దగ్గరయ్యాడట.

జ‌య‌చిత్రను ప్రేమించడంతో పాటు ఆమెకు జీవితంపై ఎన్నో ఆశలు కల్పించాడట. అయితే ఉన్నట్టు ఉండి సుధాక‌ర్‌ ఒక రోజు చెన్నై కనకదుర్గ ఆలయంలో ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన జయచిత్ర హృదయం మొక్కలు అయింది. తాను ఎంతో ఇష్టపడ్డ‌ సుధాకర్ ఇలా చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదట.

వెంటనే సుధాకర్ కంటే అందగాడు అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆవేశంలో నిర్ణయం తీసుకుందట జయచిత్ర అలా గణేష్ జ‌య‌చిత్ర భర్తగా ఆమె జీవితంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత జ‌య‌చిత్ర తన ఇంట్లో ఎప్పుడూ కూడా తన మాటే నెగ్గించుకునే వారిని.. ఆమె గురించి బాగా తెలిసిన సినీ జనాలు చెప్తూ ఉంటారు.