ఆ హీరోయిన్‌తో ముర‌ళీమోహ‌న్ ప్రేమ‌పెళ్లికి విల‌న్‌గా మారిన లేడీ ఎవ‌రు ?

సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమలు, ప్రేమాయణాలు, పెళ్లిళ్లు, సహజీవనాలు చాలా కామన్ గా నడుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎప్పుడు ? ఏ హీరో హీరోయిన్ కలిసి ఉంటారో ? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ? ఎప్పుడు సహజీవనం చేస్తారో ? ఎప్పుడు పిల్లలనుకంటారో ఎప్పుడు ? విడిపోతారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమలు దోమలు అనేవి ఇప్పటినుంచే కాదు.. గత కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నవే.

ఆరేడు దశాబ్దాలుగా సినీవారంలో ప్రేమలు ఎందరి మధ్య ఎన్నో నడిచాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఒకరిద్దరూ హీరోయిన్లతో ప్రేమలో పడ్డారు అన్న పుకార్లు అయితే ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జ‌య‌చిత్ర – మురళీమోహన్ మధ్య ప్రేమాయణం నడిచిందని అంటారు. దీనిపై మురళీమోహన్ చాలాసార్లు క్లారిటీ ఇస్తూ షూటింగు ముగిసిన తర్వాత కూడా తాము చెన్నై బీచ్ లో కూర్చుని కలిసి మాట్లాడుకునే వాళ్ళం అని.. ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకునేవాళ్ళమని.. అందుకే అప్పటి మద్రాస్ సినిమా పత్రికలు మా ఇద్దరిపై లేనిపోని పుకార్లు రాసినట్టు చెప్పారు.

అయితే అప్పటికే తనకు పెళ్లి అయ్యే పిల్లలు కూడా ఉన్న విషయం ఆయన తెలిపారు. అయితే అప్పట్లో ముగ్ధ‌ద్ద మనోహరీగా ఉండే మలయాళ హీరోయిన్ దీప‌ కూడా సినిమాల్లోకి వచ్చారు. ఆమె చాలా చిన్న వయసులోనే హీరోయిన్ అయ్యారు. దీప – మురళీమోహన్ కాంబినేషన్లో రామాయణంలో పిడకలపేట అనే సినిమా వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినా ఆ సినిమా షూటింగ్ టైంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది అనేవారు. బంగారపు రంగు వర్ణంతో ఉండే దీప‌ను చూసేందుకు షూటింగ్ స్పాట్లో అందరికీ రెండు కళ్ళు చాలేవే కాదట.

అంత గొప్ప అందగత్తె దీప. ఆమె నటసింహం బాలకృష్ణ సరసను కూడా అక్బర్ సలీం అనార్కలి సినిమాలో నటించింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించారు. అయితే మురళీమోహన్ – దీప మధ్య ప్రేమ చిగురుస్తుంది అనుకుంటున్న టైంలో దీప తల్లి వారి ప్రేమకు విలన్‌లా అడ్డుపడేది అన్న రూమ‌ర్లు కూడా ఉన్నాయి. ఆమె ప్రతిరోజు సెట్ కు రావడంతో పాటు దీప‌ వెన్నంటే ఉండేదట. తన కూతురు ఏం చేస్తుంది ? ఎవరితో మాట్లాడుతుంది అన్నదానిపై ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండేదట. అలా రామాయణంలో పిడకల వేట షూటింగ్ టైంలో వీరి ప్రేమాయణం లో దీప తల్లి పిడకల వేటగా మారిందని అప్పట్లో అందరూ సరదాగా చర్చించుకునే వారట.