పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాలు సలార్ – ప్రాజెక్ట్ కే పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సలార్ నుంచి వచ్చిన టీజర్ అయితే నేషనల్ వైడ్‌గా సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. ఇక సలార్ ఈ యేడాది సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. సలార్ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే ప్రభాస్ మరో భారీ పాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ కే కూడా థియేటర్లలోకి దిగుతోంది.
ప్రాజెక్ట్ కే మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న హైప్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకు వెళ్లనున్నారు. రు. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను ఈ నెల 20న అమెరికాలో, 21న ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే కన్ఫార్మ్ చేశారు. దీంతో సలార్‌తో పాటు ప్రాజెక్ట్ కే పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో రెండు వేర్వేరు చేతలు ఒకదానిని ఒకటి ఢీ కొట్టినట్టు చూపిస్తున్నారు. ఇక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు కూడా ప్రభాసే అని తెలుస్తోంది. అంటే సినిమాలో భూత, భవిష్యత్ కాలాల నుంచి కాన్సెప్ట్ ఉంటుంది. అందువల్ల రెండు కాలాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు ప్రభాస్‌ల మధ్య వార్ ఉంటుందట.
అందులో ఒక ప్రభాస్ రోల్ విలన్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథ అని చెపుతున్నా ఇందులో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కు బాగా స్కోప్ ఉంటుందని నిర్మాత అశ్వీనీదత్ చెపుతున్నారు. ఏదేమైనా ప్రభాస్ సినిమాలో ప్రభాసే విలన్ అంటే… ఇద్దరి మధ్య వార్తో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమే..!