టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా యంగ్ దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన సినిమా బేబి. లేటెస్ట్ యూత్ ఫుల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన “బేబి” సినిమాకు రిలీజ్‌కు ముందే మంచి బజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ చిన్న సినిమా రిజల్ట్‌పై మంచి కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్లు రిలీజ్‌కు ముందే రోజే ప్రీమియర్లు వేశారు.
ఇక రిలీజ్‌కు ముందే మంచి సాలిడ్ బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఇక నిన్న రిలీజ్ అయిన బేబీ ఏపీ, తెలంగాణతో సహా యూఎస్ లో కూడా యూనానిమస్ పాజిటివ్ టాక్ తో అయితే అదరగొట్టింది. ఈ క్రమంలోనే ఫస్ట్ డే వసూళ్లు అదిరిపోయాయి. ఆనంద్ దేవరకొండ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఈ సినిమా రికార్డు నెలకొల్పింది.
ఈ సినిమా మొత్తంగా ఫస్ట్ డే రూ. 2.50-3.00 కోట్లు షేర్ కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. బేబీ సినిమా నైజాంలో రూ. 2.25 కోట్లు – ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు – సీడెడ్‌లో రూ. 1 కోటి – కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది.
ఇక ఏపీ, తెలంగాణలోనే రు. 3 కోట్ల షేర్ ఫస్ట్ డే రాబట్టిన బేబీ యూఎస్‌లో అయితే 1 లక్ష 50 వేల డాలర్స్ మార్క్ క్రాస్ చేసేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా యూఎస్ లో అదిరే లాంగ్ రన్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతోందన్న అంచనాలు ఉన్నాయి.