‘ జామ‌పండు ‘ తో మ‌నిషికి ఇంత ఆరోగ్య‌మా… త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

జామ పండులో ఉండే లక్షణాలు చాలా మందికి తెలియక జామ‌కాయ తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అయినా ఈ త‌రం యూత్‌ ఎక్కువగా పిజ్జాలు, బర్గర్లు, చిరు తిల్లు తింటానికి ఇష్టపడతారు. అయితే జామ‌పండు ఉప‌యోగాలు తెలిస్తే ప్ర‌తి ఒక్క‌రు జామ‌కాయ అస్స‌లు మాన‌కుండా తినేస్తారు. జామ పండులో ఫైబర్, పొటాషియం ఉంటాయి. గుండె సమస్య ఉన్నవాళ్లు జామపండు తింటే రక్తప్రసరణ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

జామకాయలో ఉండే అవుట్ యాక్సిడెంట్ గుణాలు.. కొలెస్ట్రాన్ని కూడా తగ్గిస్తాయి. జామకాయతో క్యాన్సర్ పెర‌గ‌కుండా కంట్ర‌ల్లో ఉంటుంద‌ట‌. జామకాయలో ఉండే బ్యాక్టీరియల్ గుణాలు.. చర్మానికి సంబంధించిన వివిధ సమస్యలకు మందుగా ఉపయోగపడ‌తాయ‌ట‌. అజీర్ణం, విరోచనాలు, కడుపులోనొప్పి లాంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఇందులో ఉండే విటమిన్ సి వల్ల‌ కంటి కంటి చూపు బాగా బ్రైట్‌గా ఉండ‌డంలో సహాయపడుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా జామకాయ తింటే.. షుగ‌ర్ కంట్ర‌ల్లో ఉంచ‌డంలో సహాయపడుతుంది. ఆడవారికి పీరియడ్స్ లో ఉపశమనం ఇవ్వడంలో దోహదపడుతుంది. అలాగే పంటి నొప్పి, చిగురులను బలంగా ఉంచి శక్తివంతంగా పనిచేస్తుంది. బాడీలో ఉండే ఫ్యాక్ట్ తగ్గించి సన్నబడేలా చేస్తుంది. ఓవ‌రాల్‌గా జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.