ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలకి మాత్రం ఇండస్ట్రీలో గుర్తింపు ఎప్పటికీ పోదు. అలాగే అల్లరి నరేష్, శర్వానంద్ కాంబోలో వచ్చిన “గమ్యం” సినిమా కూడా ఎప్పటకీ ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతుంది. ఈ గమ్యం సినిమాలో అల్లరి నరేష్ ,శర్వానంద్ హీరోలుగా నటిస్తే కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాడు. గమ్యం అల్లరి నరేష్, శర్వానంద్ కెరీర్‌లను నటనా పరంగా మార్చేసింది.
క్రిష్‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఇలాంటి మంచి స్టోరీలతో సినిమాలు వచ్చి చాలా ఏళ్లు గడిచిపోయింది. మళ్లీ అలాంటి కథని తీసుకొచ్చే దర్శకుడు లేడని చెప్పాలి. గమ్యం సినిమాకు మొదట అనుకున్నా హీరోలు వేరట. అందులో అల్లరి నరేష్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. గాలి శీనుగా తన నటనతో జనాలందని ఆకట్టుకున్నాడు.
అల్లరి నరేష్ కంటే ముందు ఆ పాత్ర కోసం క్రిష్ “కమెడియన్ సునీల్” ని అనుకున్నాడట. కానీ సునీల్ మాత్రం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండడంతో చెయ్యనని చెప్పాడట. దీంతో సునీల్ ప్లేస్ లో అల్లరి నరేష్ అయితేనే న్యాయం చేయగలుగుతాడని భావించి అల్లరి నరేష్‌ని తీసుకున్నారు. అల్లరి నరేష్ కూడా ఆ పాత్రకు న్యాయం చేశారు.