వామ్మో.. ఇది నిజంగానే అనుష్క అభిమానులను బాధపెట్టే న్యూస్ అనే చెప్పాలి..గత రెండు, మూడు సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న అనుష్క ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో అనుష్క ఇప్పటివరకు తను నటించిన పాత సినిమాలకు ఎంతో భిన్నంగా డిఫరెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా గ్రాండ్ గా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సినిమానే అనుష్క ఆఖరి సినిమా కానుంది అని తెలుస్తుంది. ఈ బ్యూటీ ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకుంటుందట. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క పెళ్లి చేసుకుని సినిమాలను వదిలేయాలని అనుకుంటుందట. ఇప్పటికే 40 సంవత్సరాలు దాటిన అనుష్క ఇన్ని సంవత్సరాలుగా ప్రభాస్ కోసం ఎదురుచూసి ఎంతో అలసిపోయిందట.
అందుకే తన తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేక ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి వారి తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట. ఇక ఇప్పుడు ఈ వార్త ప్రభాస్ అభిమానులకు కాస్త ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా ఈ పాన్ ఇండియా హీరో కళ్ళు తెరిచి అనుష్కను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది.. అంటూ ప్రభాస్ అభిమానులు సజస్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి అనుష్క- ప్రభాస్ పేర్లు వైరల్ గా మారాయి.