ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన అప్పటి స్టార్ హీరోయిన్ల ఇప్పటి ఫొటోలు సోషల్ మీడియా పుణ్యాన బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ మాజీ స్టార్ హీరోయిన్ ఫొటో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన ఓ హాలీవుడ్ రేంజ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఓ హీరోయిన్ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ ఫొటో హీరోయిన్ టక్కరిదొంగ సినిమాలో హీరోయిన్ కావడం విశేషం. 2002 సంక్రాంతికి ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలు అందుకోలేదు. సీనియర్ దర్శకుడు జయంత్ సీ పరాంజి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కేఎస్ రామారావు మొదట టక్కరిదొంగకు నిర్మాతగా అనుకున్నా.. ఆయన తప్పుకోవడంతో జయంత్ సొంతంగా సినిమాను నిర్మించారు.
సినిమా కథ, కథనాలు బాగున్నా బడ్జెట్ ఎక్కువ కావడంతో కమర్షియల్‌గా అనుకున్న సక్సెస్ కాలేదు. ఇక
మహేష్ బాబు ఈ సినిమాలో కౌబాయ్‌గా కనిపిస్తారు. అడ్వెంచరస్ గా ఈ సినిమా తీయాలని తొలుత అనుకున్నా తర్వాత కౌబాయ్ స్టోరీగా మార్చారు. ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా బిపాసా బసు, లిసా రే హీరోయిన్లుగా నటించారు.
లిసా రే పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. తెలుగులో టక్కరిదొంగ లో తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఈమె కెనడియన్ నటి కావడం విశేషం. సినిమాలకు దూరమయ్యాక ఆమె పలు హిందీ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు. ఇటీవల ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో లేటెస్ట్ ఫొటో షేర్ చేసారు. ఈ ఫోటోలలో ఈమె గుర్తు పట్టలేనట్టుగా ఆంటీ అవతారంలో కనిపిస్తున్నారు.