దివంగత నటి.. అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వి కపూర్ తల్లి వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. కానీ మొదటి సినిమా జాన్వీ కపూర్ కు అంత సక్సెస్ ఇవ్వలేదు. దీంతో మంచి హిట్ కోసం ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంది. ఇప్పటికీ బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమాలేవి జాన్వీకి మంచి గుర్తింపు తేలేకపోయాయి.
ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సౌత్‌లో స్టార్ హీరోయిన్గా వెలగిపోవాలనుకుంటోన్న జాన్వి ఆశలన్నీ దేవర సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశతో ఎదురుచూస్తుంది జాన్వీకపూర్. ఇప్పటికే టాలీవుడ్ లో జాన్వీ కోసం వరుస సినిమాలు క్యూ కట్టాయట.
కానీ దేవర సినిమా రిలీజైన తర్వాత ఆచితూచి అడుగులు వేసి.. అచితూచి కథనలు ఎంచుకోవాలని ఉద్దేశంతో ఏ కథని ఓకే చేయలేదని తెలుస్తుంది. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న జాన్వీ ఖాళీ దొరికితే చాలు.. అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే జాన్వి ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది.
ఇక తాజాగా బ్లాక్ టాప్‌లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. టైట్ ఫీట్ డ్రెస్‌లో వయ్యారాలు వలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన జాన్వీ ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే జాన్వీ తమిళంలోనూ అడుగు పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం ఇప్పటికి తమిళ్లో ఓ సినిమాను ఓకే చేసిందని తెలుగు, తమిళ్ రెండు ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేస్తూ తన కెరీర్ కంటిన్యూ చేయాలనుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.