బాలీవుడ్లో హీరో, హీరోయిన్స్ ఎవరో ఒకరితో డేటింగ్ లోనో, ప్రేమలోనొ ఉండడం చాలా కామన్ అయిపోయింది. మనం ఎప్పటికప్పుడు ఎవరో ఒక హీరో, హీరోయిన్ ప్రేమలోనో లేదా డేటింగ్లోనే ఉన్నారనే వార్తలు చూస్తూనే ఉంటాం. తాజాగా బాలీవుడ్ లో మరో హీరో, హీరోయిన్ జంట మధ్య ప్రేమాయణం నడుస్తుంది. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే, యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
గత కొంత కాలం నుంచి వీరిద్దరూ బాగా క్లోజ్ గా కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జంట ఎవరికి తెలియకుండా కవర్ చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయారు.తాజాగా వీరు అప్లోడ్ చేసిన ఫోటోల్లో ఒకరికొకరు హగ్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బీటౌన్ సినీ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం మీ జంట ప్రేమాయణం, డేటింగ్ బాలీవుడ్ లో వైరల్ గా మారింది. అయితే వీళ్ళిద్దరి వయసులో 13 ఏళ్లు తేడా ఉంది. అయినా ఇలాంటివి టాలీవుడ్, బాలీవుడ్ లో చాలా కామన్ అయిపోయాయని మరి కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆదిత్య రాయ్ కపూర్ ఇటీవలే ది నైట్ మేనేజర్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఇక అనన్యపాండే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ సినిమాలో నటించింది. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.