కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఒక్క సినిమాతోనే సూపర్ పాపులర్ అయ్యింది. 2016లో మిస్ సూపర్ నేషనల్ ఇండియన్ అవార్డు దక్కించుకున్న శ్రీనిధి శెట్టి మోడలింగ్‌లో అడుగుపెట్టి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రశాంత్‌నీల్ డైరెక్షన్లో యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 లో నటించిన శ్రీనిధి ఆ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కావడంతో నేషనల్ వైడ్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఈ సినిమాల తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుందనుకున్న ఆమె కెరీర్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఎలాంటి అవకాశాలు లేక ఖాళీగా ఉంది. కేజిఎఫ్ పార్ట్ 1,2 ల తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కోబ్రా సినిమాలో నటించిన శ్రీనిధి షాకింగ్ రిజల్ట్ చెవి చూసింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు వచ్చినా కథ నచ్చి.. రెమ్యూనరేషన్ ఓకే అనుకుంటేనే సినిమాలు చేయడానికి రెడీగా ఉందట శ్రీనిధి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు ఫోటోషూట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. తాజాగా శ్రీనిధి క్యాజువల్ లుక్ లో దిగిన ఫోటోలో నుదుటిపై బొట్టుతో కనిపించింది. దీంతో ఆమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా.. శ్రీనిధికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే శ్రీనిధి కర్ణాటక అమ్మాయి. కర్ణాటకలో పెళ్లి కాని వారు కూడా నుదుటన బొట్టు పెట్టుకోవడం వారి ఆచారమట.
ఈ ఆచారాలు ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా పెళ్లి అయిన మహిళలు నుదిటి బొట్టు పెట్టుకుంటారు. కానీ కర్ణాటకలో పెళ్లి కాని వారు కూడా నుదుట బొట్టు పెట్టుకుంటారట. ఇక శ్రీనిధి కూడా అలానే నుదుట బొట్టు పెట్టుకొని క్యాజువల్ లుక్ తో ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం నుదుటిపై కుంకుమ ధరించి స్మైలీ లుక్ తో ఉన్న శ్రీనిధి పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.