వ‌జ్రంతో స‌మాన‌మైన ఆహారం ఏదో తెలుసా… అంత స్పెష‌ల్ ఏంటో..!

ఆరోగ్యమైన ఆహారం అంటే మ‌నకి ముందుగా గుర్తుకొచ్చేవి పాలు, గుడ్లు, పండ్లు, పండ్ల‌ రసాలు, కాయగూరలు, ఆకుకూరలు. అయితే వీట‌న్నికంటే కూడా ఆరోగ్యకరమైన ఆహారం మ‌రొక‌టి ఉంది. తగిన మొత్తంలో క్యాలరీలు, మంచి ప్రోటీన్స్ పీచు పదార్థం అధిక మొత్తంలో ఉండి.. యాంటీ ఆక్సైడ్‌తో పాటు తక్కువ ఫ్యాట్ ఉన్న‌ ఆహారమే మొలకలు. వీటినే ఇంగ్లీషులో (sprouts) అంటారు.

స్ప్రౌట్స్ అంటే అందరికీ గుర్తుకొచ్చేవి ఏమంటే పచ్చిమొలకలు. అయితే ప‌చ్చి మొల‌క‌లు తింటే అరగవు అని.. కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుందని వాటి జోలికి పోరు. మరి కొంద‌రు రుచి లేని మొలకలు తినటం కంటే రుచికరమైన ఫుడ్ తినటం బెటర్ అనుకుంటారు. మిగిలిన ఆహారంలో లేని ప్రోటీన్స్ మొలకల్లో ఏమున్నాయో తెలుసుకుంటే వాళ్ళ అభిప్రాయాలు మారవచ్చు.

మొలకలు గింజల నుంచి వస్తాయి. కానీ మనం గింజల్ని తింటాం కానీ మొలకల్ని పట్టించుకోము. కానీ గింజల్లో ఉండే ప్రోటీన్స్ కంటే మొలకల్లో ఉండే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మొలకలు తినడం వల్ల వయసు కూడా తక్కువగా కనిపిస్తుంది. బాడీలో ఐరన్ తక్కువగా ఉండే వాళ్ళు మొలకలు తింటే వాళ్ల‌కు ఐరన్ లోపం ఉండ‌దు. అందువ‌ల్ల‌ మొలకలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

అందువ‌ల్లే మిగిలిన ఆహారాల‌ను బంగారం, వెండితో పోలిస్తే మొల‌క‌ల‌ను వైద్య‌వాస్త్రంలో వ‌జ్రంతో స‌మాన‌మైన ఆహారంతో పోలుస్తూ ఉంటారు.