లాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి స్వయంకృషితో ఎనో కష్టాలు పడి స్టార్‌డం సంపాదించుకున్నారు. ఆయన నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్ కావడంతో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలామందికి ఇన్స్‌ప్రేషన్ గా ఉన్నాడు. ఇక మెగా బ్యాక్ గ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్.
” చిరుత ” సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన
మగధీర సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోలీగ్‌లోకి వచ్చేశాడు. ఇక గతేడాది ” ఆర్ఆర్ఆర్ ” సినిమాతో స్టార్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రామ్ చరణ్ కెరీర్ మొదటి నుంచి ప్రతి సినిమాకు తండ్రి సలహాలు తీసుకునే వాడట.
అయితే ఒక్క సినిమాను మాత్రం తండ్రి ఈ సినిమా చేయవద్దు అని చెప్పినా చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. ఇంతకి ఎంటా ? సినిమా అనుకుంటున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా రామ్ చరణ్ తో కలిసి నటించిన ” తుఫాన్ “. ఈ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వవచ్చు అనే ఉద్దేశంతో రామ్ చరణ్ చిరంజీవి నో చెప్పినా ఈ సినిమాలో నటించాడట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్దే కాక బాలీవుడ్ లోనూ డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా రిలీజై ఫ్లాప్ అయ్యాక చాలామంది సినీ ప్రముఖులు రామ్ చరణ్.. చిరంజీవి మాట విని ఉంటే బాగుండేదేమో అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఇక ఆ తర్వాత నుంచి రామ్ చరణ్ కథలు ఎంచుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేసే వాడని.. చిరంజీవి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే సినిమాకు ఓకే చేస్తున్నాడని అంటారు.
అదే టైంలో అల్లు అరవింద్ మంచి కథలు అన్నింటిని తన కుమారుడు బన్నీ కోసం బ్లాక్ చేస్తూ వస్తున్నాడన్న సందేహం ఎప్పుడు అయితే చిరంజీవిలో రావడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి రామ్‌చరణ్ సినిమాల విషయంలో అరవింద్ ఇన్వాల్‌మెంట్ పక్కన పెట్టేసి నేరుగా చిరుయే చూసుకుంటున్నాడు.