ఈ టైటిల్ చూడడానికే చాలా విచిత్రంగా ఉంటుంది. మన టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ అత్తగారికి మన మెగాస్టార్ చిరంజీవికి లింక్ ఏంట్రా ? బాబు అని చాలామంది లోతుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రభాస్ కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. జయంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అలనాటి మేటినటి మంజుల కుమార్తె శ్రీదేవి హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాలో ప్రభాస్ ప్రియురాలి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించింది. వెండితెర మీద ప్రభాస్ – శ్రీదేవి ఆన్ స్క్రీన్ జోడి అదిరిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా 50 రోజులు ఆడడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర ఎబో యావరేజ్ సినిమాగా నిలిచింది. ప్రభాస్ ఊరమాస్ క్యారెక్టర్‌లో అదర గొట్టేశాడు. ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకి ఇటు శ్రీదేవి తల్లి మంజులకి పాత పరిచయాలు చాలానే ఉన్నాయి.
ఈ క్రమంలోనే మంజులను ప్రభాస్ ఆంటీ ఆంటీ అని ఎంతో ఆప్యాయతతో పలకరించేవాడట. అలా మంజుల ఫ్యామిలీతో ప్రభాస్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే మంజులకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ చెన్నైలో ఇచ్చిన ఓ అద్భుతమైన ఇల్లు ఉండేదట. మంజుల ఆ ఇంటిని అమ్మకానికి పెట్టగా.. దానిని మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశారు.
చిరంజీవి చెన్నైలో తొలిసారిగా కొనుగోలు చేసిన ఇళ్లు మంజులదే కావటం విశేషం మరో ట్విస్ట్ ఏంటంటే మంజుల ఎంజీఆర్ కు తొలి ప్రియురాలు అన్న టాక్ అప్పట్లో కోలీవుడ్లో గట్టిగా వినిపించేది. అందుకే ఆయన మంజులకు ఆ ఇళ్లు ఇచ్చాడట. మంజుల తర్వాత ఎంజీఆర్ లతను ఆ తర్వాత జయలలితను గట్టిగా వాడుకున్న విషయం అందరికీ తెలిసిందే.