డిజాస్ట‌ర్ అయినా కూడా రు. 100 కోట్లు క‌లెక్ష‌న్లు.. ఇదిరా ‘ ప‌వ‌ర్ ‘ స్టార్ స్టామినా..!

మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ సినిమా మొదటిరోజు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అలా పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాలు దాదాపుగా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తాయి. అసలు విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా దాదాపు రూ. 100 కోట్లు వసూళ్ళు చేశాయి.

ప్లాప్ సినిమాతోనూ రు. 100 కోట్లు కొల్ల‌గొట్ట‌డం ప‌వ‌న్‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది. పవన్ కళ్యాణ్ – శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో కాటమరాయుడు ఒకటి. కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి అనుప్ రుబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలో కమల్ కామరాజు, ఆలీ, ప్రదీప్ రావత్ కీ రోల్ ప్లే చేశారు. శ్రేయస్ట్ మూవీస్ బ్యానర్ పై తర్కెక్కిన ఈ సినిమా 2017లో విడుదలై ఫ్లాప్ అయినా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ క‌ల‌క్ష‌న్‌న్లు, రూ. 62 కోట్ల షేర్లు సొంతం చేసుకుంది.

అలాగే త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లోఏ యే రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలో హిట్ గా నిలవగా ఇదే కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్, అనూ ఇమ్మ‌న్యూయేల్ హీరోయిన్లుగా నటించారు.

2018 లో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా కలెక్షన్స్ ప‌రంగా దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ళు సాధించింది. వాస్తవానికి ఇది ఒక సంచలన‌ రికార్డనే చెప్పాలి. ఎందుకంటే ప్లాప్‌ల‌తో కూడా రూ.100 కోట్ల వసూలు చేయడం సాధార‌ణ విష‌యం కాదు.కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్‌కి మాత్రమే సాధ్యమైంది.