రంభ అలియాస్ విజయలక్ష్మి మూడు దశాబ్దాల క్రితం తెలుగు సినిమా పరిశ్రమను తన అందం.. అభినయంతో ఒక ఊపు ఊపేసింది. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయితే ఆమె సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరు కాస్త రంభగా మారింది. ప్రారంభంలో చిన్నాచితకా సినిమాలలో నటించిన రంభ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.
అక్కడ నుంచి కొన్నేళ్లపాటు ఆమె అస్సలు వెనుతిరిగి చూడలేదు. టాలీవుడ్‌ను ఒక దులుపు దులిపేసింది. అసలు రంభ అందానికి ప్రత్యేకంగా ఎంతోమంది అభిమానులు ఉండేవారు. ఆమెను అప్పట్లోనే థైస్ సుందరి అని పొగిడేవారు. ఆ తర్వాత భోజ్‌పురి భాషలోకి ఎంట్రీ ఇచ్చిన రంభ అక్కడ ఒక వెలుగు వెలిగిపోయింది. భోజ్‌పురి సినీ ప్రేక్షకులు అందరూ రంభను ఆరాధ్య దేవతగా ఆరాధించారు.
సినిమాలకు దూరమయ్యాక రంభ కెనడాకు చెందిన ఎన్నారై ఇంద్ర కుమార్ ను పెళ్లి చేసుకుని ఎంచక్కా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమా షూటింగ్ జరుగుతుండగా హీరో జె.డి చక్రవర్తి రంభను బాగా ఇబ్బంది పెట్టేవాడట. రాఘవేంద్రరావు సినిమాలు అంటేనే బొడ్డు మీద పూలు, పండ్లు వేయిస్తారు.
అయితే ఒకసారి జెడీ పక్కనే ఉన్న పుచ్చకాయని చూపించి నెక్ట్స్ ఆ పుచ్చకాయ నీ బొడ్డు మీద వేస్తాను అని చెప్పడంతో రంభ ఒక్కసారిగా భయపడి పోయిందట. రంభ – జేడి సీన్ సరిగా చేయకుండా జోకులు వేసుకుంటూ ఉండడంతో రాఘవేంద్రరావు ఒక్కసారిగా సీరియస్ అయ్యి మీరు జోకులు వేసుకున్నాక నాకు చెప్పండి.. అప్పటివరకు బయటకు వెళ్లిపోండి ఆ తర్వాతే నేను సీన్ షూట్ చేస్తాను అని ఫైర్ అయ్యారు అంట.
దీంతో రంభ వెంటనే భోరున ఏడ్చేసిందట. పక్కనే ఉన్నవారు సర్ది చెప్పడంతో ఆమె తిరిగి షూటింగ్లో పాల్గొందట. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు స్వరాభిషేకం కార్యక్రమంలో రంభ, జెడి చక్రవర్తి గుర్తుచేసుకున్నారు. అయితే జెడి తనను అప్పటికే ఇప్పటికీ.. ఎప్పుడు టార్చర్ పెడుతూనే ఉంటాడని కూడా రంభ తెలిపింది.