టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడు.. ఆరు ప్రదుల వయసు దాటిన నాగార్జున ఇప్పటికే కుర్రాడిలా తన ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఉంటాడు. నాగార్జున ముందు నుంచి అమ్మాయిల డ్రీమ్ బాయ్ అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. నాగార్జున అమ్మాయిల విషయంలో పెద్ద ప్లే బాయ్ గా ఉంటాడని ఇండస్ట్రీలో ఉన్న టాక్స్ తెలిసిందే.
నాగార్జున సినిమాల్లోకి రాకముందే దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు ఏకైక కుమార్తె లక్ష్మిని పెళ్లి చేసుకుని.. నాగచైతన్యకు జన్మనిచ్చారు. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చేసి తన తోటి హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక నిన్నే పెళ్ళాడుతా సినిమా తర్వాత నాగార్జున – టబు బంధం బాగా బలపడింది అని… వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ మైకంలో మునిగిపోయారని టాలీవుడ్ లో అందరూ చెప్పుకుంటారు.
ఇంకా చెప్పాలి అంటే నాగార్జున మీద ఇప్పటికీ ఉన్న ఆ ప్రేమతోనే టబు ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉందని కూడా గుసగుసలు ఉండనే ఉన్నాయి. అయితే నాగార్జున కేవలం టబుతో మాత్రమే కాదు.. మరో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తోనూ కొంతకాలం ప్రేమాయణం నడిపాడన్న గుసగుసలు అప్పట్లో వినిపించాయి. వీరిద్దరి కాంబినేషన్లో హలో బ్రదర్ – చంద్రలేఖ లాంటి సినిమాలు వచ్చాయి.
నాగార్జున – రమ్యకృష్ణ చాలా అంటే చాలా సన్నిహితంగా ఉండేవారని… నాగార్జున – రమ్య అని ముద్దుగా పిలవడంతో పాటు సెట్లోనే రాసుకుపూసుకు తిరిగే వారిని కూడా చెబుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే చాలా ఏళ్ల తర్వాత వచ్చిన సోగ్గాడే చిన్నినాయన – బంగార్రాజు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా నాగార్జున రమ్యకృష్ణ నే రిపీట్ చేసిన సంగతి తెలిసిందే.