సినిమా వాళ్లు పైకి మాత్రం వాటేసుకుని చేతులు కలుపుకుని తామంతా ఒక్కటే అని బిల్డప్ ఇస్తూ ఉంటారు.. లోపల మాత్రం ఎవరికి వారు తామే గొప్ప.. తమ సినిమాలే బాగా ఆడాలి.. ఎదుటి హీరో సినిమాలు సరిగా ఆడకూడదు.. మా సినిమాకే ఎక్కువ కలెక్షన్లు రావాలని పంతంతో ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఇది వాస్తవం.
ఇక టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ అనేది ఎప్పుడు ? ఆసక్తికరంగా ఉంటుంది. అది ఎత్తులు పై ఎత్తులతో కొనసాగుతుంది. గతంలో ఏఎన్ఆర్ – ఎన్టీఆర్ ఆ తర్వాత ఎన్టీఆర్ – సూపర్ స్టార్ కృష్ణ మధ్య వృత్తిపరమైన పోటీ తర్వాత… 1990వ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఈ వార్ అలాగే నడిచింది. ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే ? అప్పట్లో ఏఎన్ఆర్.. ఎన్టీఆర్ సినిమాలకు సరైన హీరోయిన్లను లేకుండా మంచి హీరోయిన్ల డేట్లు అన్ని ముందుగానే బ్లాక్ చేసి పెట్టే వారట.
సావిత్రి – భానుమతి – అంజలీదేవి లాంటి హీరోయిన్లతో ఎన్టీఆర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించారు. ఆ తర్వాత వీళ్లంతా ఎన్టీఆర్ కంటే ఏఎన్నార్‌తోనే సినిమాలు చేసేవారట. ఏఎన్నార్ వ్యూహాత్మకంగానే వీళ్ల డేట్లు తన సినిమాల్లో బ్లాక్ చేయించేవారట. అందుకే ఎన్టీఆర్ కృష్ణకుమారి – దేవిక – బి. సరోజాదేవి- కెఆర్. విజయ లాంటి హీరోయిన్లను ఎంకరేజ్ చేసి వారిని ప్రోత్సహించేవారు.
ఇక 1990వ దశకంలో చిరంజీవి కూడా బాలకృష్ణతో వృత్తిపరమైన పోటీ గట్టిగా ఉన్నప్పుడు బాలకృష్ణ సినిమాలకు హీరోయిన్లు లేకుండా.. అప్పటి స్టార్ హీరోయిన్లపై బాలకృష్ణ సినిమాలలో నటించకుండా అప్పటి స్టార్ హీరోయిన్ల పై ఒత్తిడి చేసేవారన్న పుకార్లు ఉన్నాయి. మీకు నా సినిమాలలో ఛాన్సులు ఇవ్వాలి అంటే బాలయ్య పక్కన నటించవద్దని చిరు కండిషన్లు పెట్టేవారన్న గుసగుసలు అయితే అప్పట్లో వినిపించేవి.
అందుకే బాలయ్య ఎక్కువగా విజయశాంతి లాంటి హీరోయిన్లతోనే నటించడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతారు. ఏది ఏమైనా నాడు ఏఎన్నార్ విషయంలో హీరోయిన్ల దొరకక ఎన్టీఆర్ ఎలా ఇబ్బంది పడ్డారో ? ఆ తర్వాత తరంలో చిరంజీవి వల్ల కూడా బాలయ్య అలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారని చెబుతూ ఉంటారు.