ప్రపంచ‌క‌ప్ క్రికెట్ టిక్కెట్‌ రేట్లు వ‌చేశాయి… ఏ మ్యాచ్ టిక్కెట్ ఎంతంటే…!

భారత్ గ‌డ్డ‌పై జరగనున్న ప్ర‌పంచ‌క‌ప్ 2023 వ‌న్డే క్రికెట్ మ్యాచ్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఐసీసీ ఈ గ్రాండ్ ఈవెంట్ షెడ్యూల్ ఫిక్స్ చేసేసింది. ఈ టోర్నీలో పాల్గొనే టీమ్స్ తమ స్ట్రాటజీలను ర‌చించడం మొదలు పెట్టేశాయి. ఇక భారతదేశంలో 10 స్టేజ్‌ల‌పై అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగాటోర్నీ జరగబోతుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత జట్టు విషయానికి వస్తే అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడ‌నుంది.

క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసే దాయాది దేశాలైన పాకిస్తాన్ – భార‌త్ వార్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జ‌ర‌గ‌బోతుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో కోల్‌కొత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మొత్తం ఐదు లీగ్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. వీటితో పాటు సెమీఫైనల్ 2 కూడా అక్కడే జరగనుంది. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్‌ల‌ టికెట్ రేట్ల‌ను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్ చేసేసింది. ఈడెన్ గార్డెన్ స్టేజ్ పై షెడ్యూల్ చేయబడిన అన్ని మ్యాచ్‌ల టిక్కెట్‌ ధరలు రూ.650 నుంచి రూ.3000 వరకు ఫిక్స్ చేశారు.

ఇక వరల్డ్ కప్ టికెట్స్ రేట్లు ఇలా ఉన్నాయి :
బంగ్లాదేశ్‌ VS నెదర్లాండ్ మ్యాచ్ :
అప్సర టైర్స్ రూ.650
D అండ్ H బ్లాక్స్ రూ.1000
B,C,K,L బ్లాక్‌లకు రూ.1500

ఇంగ్లాండ్ VS పాకిస్తాన్ మ్యాచ్ :
అప్సర టైర్స్ రూ.800
D,H బ్లాక్ రూ.1200
C,K బ్లాక్ రూ.2000
B,L బ్లాక్ రూ.2200

బంగ్లాదేశ్ VS పాకిస్తాన్ మ్యాచ్ :
అప్సర టైర్స్ రూ.800
D,H బ్లాక్ రూ.1200
C,K బ్లాక్ రూ.2000
B,L బ్లాక్ రూ.2200

ఇండియ VS సౌతాఫ్రికా మ్యాచ్ :
అప్సర టైర్స్ రూ.900
D,H బ్లాక్ రూ.1500
C,K బ్లాక్ రూ.2500
B,L బ్లాక్ రూ.3000

సెమీ ఫైనల్ మ్యాచ్ :
అప్సర టైర్స్ రూ.900
D,H బ్లాక్ రూ.1500
C,K బ్లాక్ రూ.2500
B,L బ్లాక్ రూ.3000