చిరు భార్య సురేఖలో.. బాలయ్య భార్య వసుంధరలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా..!

చిత్ర పరిశ్రమలో ఎంతమంది స్టార్‌ హీరోలు ఉన్నా సరే.. మన తెలుగు చిత్ర పరిశ్రమ పేరు చెప్పగానే అంద‌రు చెప్పే రెండే రెండు పేర్లు చిరంజీవి- బాలకృష్ణ.. ఒకప్పుడు ఎన్టీఆర్- ఏఎన్నార్ అంటే ఎంత గర్వంగా చెప్పుకునే వారో ఇప్పుడు చిరంజీవి- బాలకృష్ణ అంటూ అంతే గర్వంగా చెప్పుకుంటున్నారు. అంతలా మన తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతూ వచ్చారు ఈ ఇద్దరు హీరోలు. కాగా ఇద్దరు హీరోలు చిత్ర పరిశ్రమలో ఇంత స్టార్ హోదాలో ఉన్నారో ఈ హీరోల‌ భార్యలు కూడా అంతే స్టార్స్ గా ఉన్నారు.

మనందరికీ తెలిసిందే చిరంజీవి భార్య సురేఖ, బాలయ్య భార్య వసుంధర ఎంత సంప్రదాయంగా ఉంటారో బయటకు వస్తే వారి భ‌ర్త‌ల‌ పరువుని పెంచే విధంగానే వారి ఆలోచనలు ఉంటాయి. ఇదే సమయంలో వారి గురించి ఎప్పుడూ ఎలాంటి నెగటివ్ వార్త కూడా రాలేదు అంతలా మన తెలుగు సంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు. ఇదే సమయంలో చిరు భార్య సురేఖ లో, బాలయ్య భార్య వసుంధరలో ఉన్న కామన్ పాయింట్ వీరికి అదృష్టాన్ని తెచ్చి పెట్టిందంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

ముఖ్యంగా చిరు భార్య సురేఖ తన ఇంటికి వచ్చిన వారందరికీ లేదు కాదు అనకుండా తనకు తోచినంత సహాయం చేస్తుందట. అంతేకాకుండా ఇంటికి వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెట్టి మరి పంపిస్తారట. ఇక అది ఎవరైనా సరే ఇంటికి అభిమానం చూపించడానికి వచ్చిన అభిమానులైన, ఇంట్లో పనివాళ్ళైనా, ఇంటికి వచ్చిన స్టార్ హీరోలైనా, ఎవరైనా సరే ఇంటికి వస్తే వారి కడుపునిండా భోజనం పెట్టి సంతోషంగా ఇంటి బయట అడుగు పెట్టేలా చేస్తుందట సురేఖ.

బాలయ్య భార్య వసుంధర కూడా సేమ్ డిట్టో ఇంటికి వచ్చిన వారికి గౌరవ మర్యాదలో ఏం మాత్రం లోటు చేయకుండా నందమూరి కుటుంబ ఖ్యాతిని డబుల్ చేసింది వసుంధర అంటూ ఇప్పటికే బాలయ్య ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఉంటారు. వీరిద్దరికి ఉన్న ఈ మంచితనం కారణంగానే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చిరు- బాలయ్య పేర్లు మరింత రేంజ్ లో పాపులారిటీ వ‌చ్చింద‌ని వారి అభిమానులు అంటున్నారు. ఏమైనా సరే ఇద్దరూ మంచిభార్యలని పెళ్లి చేసుకుని లైఫ్ లో అదృష్టవంతులు అనిపించుకున్నారు.