చరణ్ తన కూతురు విషయంలో అప్పుడే షాకింగ్ డెసిషన్.. మొదటిసారి ఉపాసనాని హర్ట్ చేసాడుగా..!?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త ఎంతో వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనను ఎంతో హర్ట్ చేశాడా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మనందరికీ తెలిసిందే ముందు నుంచి ఉపాసన‌ -రామ్ చరణ్ ఎంతో హ్యాపీగా అన్యోన్యంగా ఉంటున్నారు. వీరి పెళ్లి జరిగే 10 సంవత్సరాల తర్వాత మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల కోరుకున్న విధంగా రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఉపాసన గత నెల 20వ తేదీన మంగళవారం తెల్లవారు జామున ఒంటిగంట 49 నిమిషాలకు పండంటి పాపకు జన్మనిచ్చింది.

ఇప్పటికే ఈ మెగా వారసురాలికి బారసాల ఫంక్షన్ చేసి క్లీం కార అనే పేరును కూడా పెట్టుకోచ్చారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి ప్రమోట్ అయిన తర్వాత మూడు నెలల పాటు తన సినిమాలకు బ్రేక్ వేసి తన బిడ్డతో ఎంజాయ్ చేయాలని..గతంలోనే డిసైడ్ అయినట్టు వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రామ్ చరణ్ కూడా ఎక్కడ సినిమా షూటింగ్లో కనిపించడం లేదు.. ఇక ఇప్పుడు సడన్గా ఏం జరిగిందో తెలియదు కానీ చరణ్ – శంకర్‌తో చేస్తున్న గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా ఇప్పటికే చరణ్‌ చేసే షెడ్యూల్ కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారట. తన బిడ్డకు కనీసం నెల కూడా దాటలేదు.. అప్పుడే చరణ్ ఎందుకు షూటింగ్లోకి వెళ్ళిపోతున్నాడు అంటూ మెగా అభీమానులు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. అంతేకాకుండా చిరంజీవి కూడా తన భార్య సురేఖతో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్లారు. మెగా కుటుంబం ఇప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా ప్రిన్సెస్ ఇంటికి వస్తే అందరూ ఇలా పారిపోతున్నారు ఏంటి ..? అంటూ కామెంట్లు చేస్తున్నారు మెగా అభిమానులు. ఇక ఇదే సమయంలో రామ్‌చరణ్ -శంకర్ ఫోర్స్ చేయడం కారణంగానే షూటింగ్లో పాల్గొంటున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక దీంతో ఉపాసన చాలా హర్త్ అయిందంటూ తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే వార్త వైరల్ గా మారింది.