అనుష్కను తన ఇంటికి కోడలుగా చేసుకోవాలని.. ప్రయత్నించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..!?

మన సౌత్ స్టార్ హీరోయిన్ల‌ లో అనుష్క శెట్టి కూడా ఒకరు.. బెంగళూరు నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా తన నటనతో తన అందంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సౌత్ లో ఉన్న అన్ని ఇండస్ట్రీలో సినిమాల్లో చేసిన ఈ బ్యూటీ స్టార్ హీరోలకు సమానంగా తన అభిమానులను పెంచుకుంది. ద‌శాబ్ద‌న్న‌ర కాలం పాటు చిత్ర పరిశ్రమను ఏలిన అనుష్క గత రీసెంట్ టైమ్స్ లో సినిమాలను చేయటం తగ్గించింది.

ప్రస్తుతం సంవత్సరానికి ఒక్క సినిమా కూడా అనుష్క దగ్గర నుంచి రావడం లేదు. 2020 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలోనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. ఇక అనుష్క వ్యక్తిగత జీవ‌త‌ విషయానికొస్తే ఆమె 40 సంవత్సరాలు దాటుతున్న ఇప్పటికీ పెళ్లి అనే పదం తన దగ్గరకు రానివ్వటం లేదు. అనుష్క అభిమానులు కూడా గత పది సంవత్సరాల నుంచి క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మరి అనుష్క పెళ్లి కోసమే ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదే సమయంలో అనుష్క, పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో ప్రేమలో ఉందని ఇద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరి పెళ్లి మాత్రం జరగట్లేదు ఆటు అనుష్క కూడా తాము జ‌స్ట్ ఫ్రెండ్స్ అంటూ తేల్చేస్తుంది. ఇదే సమయంలో గతంలో టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్ అనుష్కను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారని తెలుస్తుంది. ఇక ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు ద‌ర్శ‌కేంద్రుడు కే రాఘవేంద్రరావు. ఆయన కొడుకు కోవులమూడి ప్రకాష్ కు అనుష్కను ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట.

రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ 2002లో వచ్చిన నీతో సినిమాతో హీరోగా టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. అయితే ఆ సినిమా అంతగా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవకపోవడంతో ప్రకాష్ తన తండ్రి చూపిన బాటలోనే దర్శకుడుగా మారి బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో వంటి చిత్రాలను తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాలు కూడా సక్సెస్ కాలేదు. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలోను ప్రకాష్ ఫీలయ్యాడు. 2014లో ప్రకాష్ ముంబాయి కు చెందిన కనికా థిల్లాల్ ను పెళ్లి చేసుకోగా కొన్నాళ్ళకి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇదే సమయంలో నాగార్జునతో రాఘవేంద్రరావు ఓం నమో వెంకటేశాయ సినిమా తెర్కెక్కించే సమయంలో అనుష్కను దగ్గర్నుంచి చూసి తన ఇంటికి కోడలుగా చేసుకుంటే బాగుంటుందని ఎన్నో ప్రయత్నాలు కూడా చేసిరట. కానీ అనుష్కకు ఆ ఇంట్రెస్ట్ లేకపోవడంతో రాఘవేందర్రావు వెనక్కి తగ్గారని ఇండస్ట్రీలో ఇప్పటికీ ఓ టాక్ నడుస్తూనే ఉంది.