బిగ్‌ట్విస్ట్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి పాకిస్తాన్ అవుట్‌… పాక్ ప్లేసులో వ‌చ్చే కొత్త జ‌ట్టు ఇదే..!

ఈ ఏడాది భారత్లో జరగనున్న ప్రపంచ క్రికెట్ సమరం అత్యంత ఆసక్తి రేపుతుంది. మొత్తం పది జ‌ట్లు 48 మ్యాచులు ఆడనున్నాయిజ‌ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ లో దాయాది పాకిస్తాన్ ఆడుతుందా ? లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగానే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌ అంటే కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.

అలాంటిది ప్రపంచ కప్ లో ఈ రెండు జ‌ట్లు తలపడుతున్నాయి అంటే ఇక మజా ఎలా ? ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం మన దేశంలో జరిగే ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఆడటంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్లో జరిగే ఆసియా కప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు భారత్ వెళ్లడం లేదు. అందుకే భారత్ ఆడే మ్యాచ్‌ల‌ను శ్రీలంకలో నిర్వహిస్తున్నారు.

మా దేశానికి రావడానికి భారత్ కు అభ్యంతరం ఉన్నప్పుడు.. తాము భారత్ లో జరిగే ప్రపంచకప్‌కు తమ జట్టును పంపబోమని పాకిస్తాన్ క్రీడామంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ భారత్‌కు వచ్చి ప్రపంచకప్ లో ఆడాలి అంటే కచ్చితంగా ఆ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఆసియా కప్పు మ్యాచులు ఎలాగైతే తటస్థ వేదికల‌ మీద నిర్వహిస్తున్నారో ఇప్పుడు ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు కూడా అలాగే నిర్వహించాలని పాక్ పట్టుబడుతోంది.

ఒకవేళ పాకిస్తాన్ వరల్డ్ కప్ బహిష్కరించిన నేపథ్యంలో ఆ జట్టు వ‌ర‌ల్డ్‌క‌ప్ క్వాలీఫ‌యింగ్ మ్యాచ్‌ల‌లో మూడో స్థానంలో ఉన్న స్కాట్లాండ్ నేరుగా ప్రపంచకప్ కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే క్వాలిఫై మ్యాచ్‌ల‌ ద్వారా శ్రీలంక – నెదర్లాండ్స్ జట్లు ప్రపంచకప్ కు అర్హత సాధించాయి. ఇక పాకిస్తాన్ వరల్డ్ కప్‌లో కంటిన్యూ అవుతుందా లేదా స్కాట్లాండ్ కొత్తజట్టుగా ఎంట్రీ ఇస్తుందా ? అన్నది చూడాలి.