నందమూరి నటసింహం బాలయ్య – దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా ఇది పట్టాలు ఎక్కనుంది. ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో స్టార్ట్ చేయనున్నారట.
ఫస్ట్ షెడ్యూల్‌ల్లోనే హీరో బాలయ్య పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారని టాక్. ప్రస్తుతం ఈ యాక్షన్ ఎపిసోడ్ తాలూకు సెటప్ రెడీ చేస్తున్నారని సమాచారం. మరో 15 రోజుల్లో ఈ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన సెట్ అంతా పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ సెట్ పూర్తయ్యాక ఇందులో ఆ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభిస్తారట.
ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. బాలయ్య తండ్రీ కొడుకుల పాత్రలలో నటిస్తున్నట్టు సమాచారం. తండ్రిగా బాలయ్య గెటప్ ఓ రేంజ్ లో ఉంటుందని.. ఇదే సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. మామూలుగా బాలయ్యకు డ్యూయెల్ రోల్స్ సెంటిమెంట్ ఎక్కువ. బాలయ్య డ్యూయల్ రోల్స్‌లో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్టే.
ఇప్పుడు ఈ సినిమాలోనూ బాలయ్య రెండు పాత్రలలో నటిస్తుండడంతో ఈసినిమా కూడా ఆ సెంటిమెంట్‌తో సూపర్ హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు.