దానవీరశూరకర్ణలో ఏఎన్నార్ మిస్ అయిన పాత్ర ఇదే… పిలిచి పాత్ర ఇస్తే ఎన్టీఆర్‌నే ఎందుకు పొమ్మ‌న్నాడు..!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి తారకరామావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటివరకు రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఎలా ఉంటారో తెలియని తెలుగు జనాలు వెండితెరపై సీనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్రలను బట్టి ఇలాగే ఉంటారని ఫీల్ అయ్యారు.

అంతటి ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేయగలిగారు. ఈ క్రమంలో అనేక పౌరాణిక సినిమాల్లో నటించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా కొన్ని చిత్రాలకు దర్శక, నిర్మాతలుగాను వ్యవహరించేవారు. ఆయన స్వీయ దర్శకత్వంతో పాటు నటించిన అద్భుతమైన సినిమా 1977లో వచ్చిన దానవీర శూరకర్ణ.

ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ 3 పాత్రలను ఏకకాలంలో పోషించి మెప్పించారు. ఈ ఘనత ఆయనే చెల్లింది. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు ఈ 3 పాత్రల్లో లీనమైపోయి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి. సరిగ్గా అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమా రిలీజ్ అవ్వగా.. అట్టర్ ప్లాఫ్ మూటకట్టుకుంది.

ఎన్టీఆర్ ఆ సినిమాని నాగేశ్వరరావు సినిమాకి పోటీగా చేశారనే వదంతులు కూడా లేకపోలేదు. ధానవీరశూరకర్ణ మూవీ అప్పట్లో రూ.10లక్షలు ఖర్చుతో తీయగా ఏకంగా రూ.కోటికి పైగా కలక్షన్లను వసూలు చేసి సూపర్ హిట్ గా నిలవడం గమనార్హం. మారా ఈ చిత్రాన్ని మళ్లీ 1994లో థియేటర్లలో రెండోసారి కూడా విడుదల చేయగా.. అప్పుడు కూడా జనం ఎగబడి మరీ చూసారని మొన్నటితరం వాళ్ళు చెబుతూ వుంటారు.

ఇక ఇక్కడ ఓ ట్విస్ట్ ఏమంటే… దానవీరశూరకర్ణ సినిమాలో నటించి, దర్శకత్వం వహించిన ఎన్టీఆర్.. ఏఎన్నార్ ని ఈ సినిమాలో నటించాలని కోరారట. కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రను చేయమని కోరాడట. అయితే అప్పటికే కురుక్షేత్రం చేస్తున్న నాగేశ్వరరావు ఈ సినిమా చేయడం కుదరదని చెప్పడంతో ఎన్టీఆర్ మిగిలిన పాత్రను కూడా తానే పోషించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.