ర‌కుల్‌ప్రీత్ అందం ఏం ఉందిరా త‌స్స‌దీయా… ఆ బ్యూటీ సీక్రెట్ ఇదే…!

జ‌వాన్ ‘ ట్రైల‌ర్‌… నేను విల‌న్ అయితే ఏ హీరో నా ముందుకు రాడు.. షారుక్ గ‌ర్జ‌న ( వీడియో )
దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత పఠాన్ సినిమాతో షారుక్ ఖాన్ అదిరిపోయే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. లక్షలాదిమంది షారుక్ అభిమానులు కూడా తమ అభిమాన హీరోను మర్చిపోయిన తరుణంలో వచ్చిన పఠాన్ సినిమా నిజంగా షారుక్ ఖాన్ కు పునర్జన్మ ఇచ్చిందనే చెప్పాలి. పఠాన్ ఏకంగా రు. 1000 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. పఠాన్ తర్వాత షారుక్ నటిస్తున్న చిత్రం జవాన్ కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది సినీ అభిమానులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

 

కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో దుమ్ము రేపేలా ఉంది.

పఠాన్ జోష్‌తో ఉన్న షారుక్ దూకుడు జవాన్ తో కంటిన్యూ చేసేలా ఉంది. జవాన్ ట్రైలర్ చూస్తున్న వారందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. 2 నిమిషాల 12 సెకండ్ల ట్రైలర్లో షారుక్ యాక్షన్ తో సత్తా చాటాడు. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఎవరు నేను ?అంటూ షారుక్ వాయిస్‌తో మెట్రో స్టేషన్లో ట్రైలర్ మొదలవుతుంది.

నేను ఎవరిని కాను.. తెలియదు తల్లికి ఇచ్చిన మాట కావచ్చు.. నెరవేరని లక్ష్యం కావచ్చు.. నేను మంచివాడినా.. చెడ్డవాడినా.. పుణ్యాత్ముడినా… పాపాత్ముడినా.. నీకు నువ్వే తెలుసుకో ? ఎందుకంటే నేనే నువ్వు అని షారుక్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. చివరగా నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు అంటూ కింగ్ కాన్ గర్జన అదరగొట్టేసింది. ఏది ఏమైనా ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. ఇక రేపు థియేటర్లలో జవాన్ గా షారుక్‌ ఎలా ? గర్జిస్తాడో చూడాలి.