బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఇంగ్లీష్ లోనే కాకుండా మన భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తూ సూపర్ హిట్ షోగా నిలుస్తోంది. తెలుగు బిగ్‌బాస్ ఇప్పటికే ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్‌బాస్ 7 సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగానే ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ ప్రచారం మొదలైంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ నచ్చావులే ఫేమ్ మాధవి లత బిగ్‌బాస్ గురించి చేసినా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నచ్చావులే తర్వాత స్నేహితుడా సినిమా తప్ప మాధవి లత పెద్దగా విజయాలను అందుకోలేదు. అందుకే ఈ ముద్దుగుమ్మ 2018లో బీజేపీ పార్టీలో చేరిపోయింది. అప్పటినుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ బిజీగా లైఫ్ గడుపుతోంది.
చాలా క్యూట్‌గా ఉండే ఈ తార మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్‌బాస్ షో సీజన్-7 లో తనకు ఆఫర్ వచ్చిందని తాజాగా మాధవి లత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆఫర్ వచ్చినా దానిని రిజెక్ట్ చేశానని చెప్పి అభిమానులను నిరాశపరిచింది. బిగ్‌బాస్ సీజన్ సెవెన్లో మాత్రమే కాదని, ఇంతకుముందు మరో రెండు సీజన్లలో కూడా తనకు పాటిస్పేట్ చేసే ఆఫర్ వచ్చిందని మాధవి లత చెప్పుకొచ్చింది.
అయితే ఈ ఆఫర్లను రిజెక్ట్ చేయడానికి ఆ షోపై తనకు ఇంట్రెస్ట్ లేకపోవడమే కారణమని ఆమె తెలిపింది. టీవీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, మాధవి లతకు బిగ్‌బాస్ యాజమాన్యం వారానికి రూ.7 లక్షల దాకా ఇస్తానని ఒప్పుకుందట. అలా చూసుకుంటే హౌజ్‌లో 5 వారాల ఉన్నా ఆమె 35 లక్షల వరకు వెనకేసుకునేది. ఎలాంటి సినీ అవకాశాలు లేని ఆమెకు ఈ అమౌంట్ ఎక్కువే. కానీ అంత పెద్ద ఆఫర్ వచ్చినా దానిని సింపుల్‌గా మాధవి లత రిజెక్ట్ చేసిందని ప్రచారం జరుగుతోంది.