టాప్ సింగ‌ర్‌తో అనిరుధ్ ప్రేమాయ‌ణం… ఎక్కడి దాకా వెళ్లిపోయారంటే..!

కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్‌ తెలుగులో కూడా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో అనిరుధ్‌ తెలుగుతరకు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయిన మ్యూజిక్ మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

ఇక ఈ కుర్ర సంగీత దర్శకుడు ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. మ్యూజిక్ విషయంలో అనిరుధ్‌ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. తన అమ్మాయిలతో విషయంలో అంతే బాగా పాపులర్ అయ్యాడు. మొదటి నుంచి కూడా అనిరుధ్‌ అమ్మాయిల విషయంలో చాలా వివాదాలు ఎదుర్కొంటూ వస్తున్నాడు.

సుచిలిక్స్ లో సైతం అనిరుధ్‌ హీరోయిన్ ఆండ్రియా డీప్ గా మూతి ముద్దులు పెట్టుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. అనిరుధ్‌ సింగర్‌ చిన్మయి మధ్య కూడా సంథింగ్ సంథింగ్ ఉందన్న గుసగుసలు ఉన్నాయి. తాజాగా అనిరుధ్‌ సింగర్ జోనీతా గాంధీతో లింకు పెట్టుకున్నట్టు కోలీవుడ్లో వార్తలు గుప్పుమంటున్నాయి. విజ‌య్ బీస్ట్‌ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ పాడిన జోనిత‌ బాగా ఫేమస్ అయ్యింది.

తర్వాత విక్రమ్‌లో ఈ జంట ఎంతటి సంచలనం రేపిందో చెప్పాల్సిన పనిలేదు. అప్పటినుంచే వీరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనిరుధ్‌ ఎక్కడ ఉంటే జోనిత గాంధీ కూడా అక్కడే ఉంటుంది. దీంతో వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని.. త్వరలో పెళ్ళికూడా చేసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలను ఈ జంట ఖండించకపోవడంతో వీరి మధ్య ఆ బంధం నిజమే అని కోలీవుడ్ మీడియా కూడా కూస్తోంది.