హీరోయిన్లు తమ అవసరాల కోసం ఎప్పుడు ఏదైనా చేస్తారు. చాలా సులువుగా మాట మార్చేస్తారు. ఇక హీరోయిన్లు ఎప్పుడు ఎవరితో ఉంటారో ? ఎప్పుడు ఎవరితో విడిపోతారో కూడా చెప్పలేం. ఇక హాలీవుడ్ హీరోయిన్ల సంబంధాలు… వింతలు, విశేషాలు అయితే మామూలుగా ఉండవు.
తాజాగా బ్రిటీష్ – అమెరికన్ నటి హేలీ అట్వెల్ మిషన్ ఇంపాజబుల్ 7 పార్ట్నర్ నటుడు టామ్ క్రూయిజ్‌తో తాను డే..గ్ చేస్తున్నట్టు వస్తోన్న వార్తలపై స్పందించారు. 41 ఏళ్ల ఏజ్ ఉన్న తాను 61 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తితో అలాంటి సంబంధాన్ని ఎలా కొనసాగిస్తానని మీరు అనుకున్నారు.. అవన్నీ పుకార్లే అంటూ కొట్టి పడేసింది. పైగా టామ్ క్రూయిజ్‌ను అంకుల్ అంటూ పిలిచింది.
తాను టామ్‌తో సె…* రిలేషన్లు పెట్టుకున్నట్టు వచ్చిన వార్తలు చూసి ఎంతో బాధపడ్డాను అని.. ఇప్పటికే నాకు రచయిత, సింగర్ నెడ్ వోల్ఫో గ్యాంగ్ కెల్లీతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.. అయినా నాపై ఇలాంటి రూమర్లు రావడం విచిత్రంగా ఉందని చెప్పింది. టామ్ నాకు అంకుల్ లాంటి వాడు.. సినిమా షూటింగ్లో సీన్లలో సలహాల కోసం ఆయన్ను సంప్రదిస్తూ ఉంటానని.. ఆయన కూడా నా పట్ల ఎప్పుడూ చెడు ఉద్దేశంతో ఉన్నట్టు కనిపించలేదని చెప్పింది.
ఇక ఈ రూమర్లు వ్యాప్తింపజేసే వారిపై స్పందిస్తూ మీరు ఎల్లప్పుడూ మీ విలువలు కాపాడుకుంటూ మీ విలువల పట్ల చిత్తశుద్ధితో ఉంటే చాలని చెప్పింది. ఇక హేలీ నటిస్తోన్న మిషన్ ఇంపాజబుల్ సీరిస్ 7 ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.