గోవా బ్యూటీ ఇలియానా కొంత కాలం క్రితం పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయ్యానంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం అందరికి తెలిసిందే. దీంతో అభిమానులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు ? అనే విషయాన్ని మాత్రం చాలా సీక్రెట్‌గా ఉంచింది. ఇప్పటికే అతని గురించి పరోక్షంగా ఎన్నో రకాల హింట్స్ ఇస్తూ వస్తుంది.
ప్రస్తుతం ఇలియానా అతడితోనే కలిసి ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ సోదరుడితోనే ఇలియానా డేటింగ్ చేస్తోందన్న పుకార్లు అయితే బీటౌన్‌లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అతడి కంటే ముందు ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో కూడా డేటింగ్ చేసింది.
ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆమె బేబీ బంప్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు ప్రెగ్నెన్సీ లో తన అనుభవాలనికూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కి షేర్ చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలు షేర్ చేసినా ఫేస్ కనిపించకుండా దాచేసింది. ఆమె ఇంతకీ తన బాయ్ ఫ్రెండ్ విషయాన్ని ఎందుకు ? సీక్రెట్‌గా ఉంచుతుందో ఎవ్వరికి అర్థం కావట్లేదు.
తాజాగా తన బేబీ బంప్ తో షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం నేను 9వ నెలలోకి అడుగు పెట్టానని.. ఏదైనా పని చేయాలంటే కూడా నాకు చాలా నీరసంగా అనిపిస్తుందని.. చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పింది. బంప్‌లో బేబీ నన్ను తంతుండటం కాస్త నొప్పిగా కూడా అనిపిస్తుందని .. తన 9వ నెల ప్రెగ్నెన్సీ ఎక్స్‌పీరియన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుత ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.