నందమూరి నటవారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్. తాతకి తగ్గ మనవడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇటీవల నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అలాగే త్రిబుల్ ఆర్ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై కనీవినీ ఎరుగని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తోంది. ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పాత్ర ఇంటర్వెల్లో చాలా వైల్డ్ గా కనిపించబోతుందట.
ఈ రోల్ చాలా క్రూరంగా మృగాన్ని తలపించేలా ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సైఫ్ అలీఖాన్ మెయిన్ లీడ్‌గా రాక్షసుడిలా కనిపిస్తాడని.. కథ మొత్తం సైఫ్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. కథలో కొరటాల ఎన్టీఆర్ క్యారెక్టర్ ను ఏ రేంజ్‌లో హైలైట్ చేయబోతున్నాడన్న దానిపై కూడా ఇప్పటికే భారీ చర్చలు నడుస్తున్నాయి. సినిమాపై హైప్ మామూలుగా లేదు.
ఇప్పటికే కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్లో అరవింద సమేత లాంటి సూపర్ హిట్ వచ్చింది. దీంతోపాటే ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి. సినిమాను తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. దేవరలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీకపూర్ నటిస్తోంది.