ప‌వ‌న్ హీరోయిన్ అమీషా.. ఉర్ఫి జావెద్ బూతుల యుద్ధం.. ఓరి దేవుడో చెవులు మూసుకోవాలి…!

పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది అమీషా పటేల్. అప్ప‌ట్లో ఆమె ఓ నేష‌న‌ల్ ఫి…ర్‌. 55 ఏళ్ల వ‌య‌స్సు ఉన్నా అమీషా ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌రని అందం మెయింటైన్ చేస్తూ వ‌స్తోంది. త్వరలో గ‌దర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న అమీషా తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓటిటి సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇప్పుడు వస్తున్న సినిమాలేవి అమ్మమ్మ, తాతయ్య గారితో చూసేలా ఉండడం లేదు.. మా సినిమా కచ్చితంగా అమ్మమ్మ, తాతయ్యలతో.. పెద్దలు, పిల్లలు కలిసి చూసేలా ఉంటుందని.. ఓటీటీలో వస్తున్న సినిమాలను అయితే పిల్లలతో కలిసి అసలు చూడలేమని చెప్పుకొచ్చింది. స్వలింగ సంపర్కం ఉన్న కంటెంట్ తోనే ఓటిటిలో అన్ని సిరీస్‌లు వస్తున్నాయి తప్ప… కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉండడం లేదని చెప్పుకొచ్చింది అమీషా.

2001లో తరికెక్కిన ఏక్ ప్రేమ కథ సినిమాకు సీక్వెల్ గా గ‌దర్ 2 ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది నటులు అమీషాపై ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగా హాట్ బ్యూటీ, కాంట్ర‌వ‌ర్సీ కింగ్ ఊర్ఫి జావెద్ అమీషాపై ఫైర్ అయింది. గేయిజం, లెస్బి…జం అంటే అర్థాలు తెలుసా ? స్వలింగ సంపర్కం అని చెబుతున్నారు. మీ పిల్లలకు వీటి గురించి చెప్పకుండానే పెంచుతారా? అసలు ఇలాంటి సున్నితమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి కాస్త జ్ఞానం తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంద‌ని ఫైర్ అయ్యింది.

అస‌లు వాటి అర్ధాలు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే చెడ్డ చిరాకుగా ఉంటుంద‌ని అమీషాను దెప్పి పొడిచింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎటువంటి పని లేకుండా ఖాళీగా ఉండడం వల్ల అమీషా నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతుందంటూ ఊర్ఫి ఫైర్ అయింది. ఏదేమైనా అమీషా, ఊర్ఫి ఇద్ద‌రు కాస్త ఘాటు ప‌దాల‌తో కామెంట్లు విసురుకున్నారు.