నిహారిక కొణిదెల.. మెగా డాటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన మూడు యేళ్లు కూడా గడవక ముందే విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక విడాకుల తర్వాత తనకు ప్రైవసీ కావాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో సరికొత్త రూమర్లు తెరపైకి వచ్చాయి. విడాకుల తర్వాత మాజీ భర్త చైతన్య నుంచి నిహారిక భరణం కింద కోట్ల రూపాయలను డిమాండ్ చేసింది అన్న రూమర్లు బాగా స్ప్రెడ్ అయ్యాయి.
ఇక త్వరలోనే ఒక యూట్యూబర్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా రకరకాల వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో నిజం ఉందో తెలియాల్సి ఉంది. తాజాగా ఆమె విడాకుల అనంతరం రకరకాల పోస్టులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తాను సంతోషంగా ఉన్నానని పరోక్షంగా వెల్లడిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళితే నలుగురు స్నేహితులతో కలిసిన ఒక వీడియో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు ప్రతి అమ్మాయిల గ్యాంగ్ లో నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారని.. ఒక అమ్మాయి ఎప్పుడు కూడా మంచి డ్రెస్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుందని.. మరొకరు ఏ డ్రెస్ వేసుకున్న కాన్ఫిడెంట్ గా ఉంటారు అని.. ఇక ఆ గర్ల్స్ గ్యాంగ్ లో మరొక అమ్మాయి కనీసం రెడీ అవ్వడానికి కూడా ఆసక్తి చూపించదు అని.. ఇక చివరిగా ఒక మహాతల్లి ఉంటుందని.. ఆమె ఎప్పుడూ అసలు కనిపించదు అని కూడా నిహారిక తన పోస్టులో వెల్లడించింది.
ఇక ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారడంతో.. ఇది చూసిన నెటిజన్లు కొంతమంది విడాకుల తర్వాత నిహారిక చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తుండగా మరి కొంతమంది విడాకుల వచ్చి వారం కూడా కాకుండానే ఫుల్ ఖుషీగా వుంది.. ఇదేం పాడు పనిరా బాబోయ్..అంటూ తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి అయితే నిహారికకి భర్త కంటే స్నేహితులే ఎక్కువ అన్నట్లుగా మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.