‘ ప్రాజెక్ట్ కే ‘ పై ఇండియ‌న్ సినిమా ఉలిక్కిప‌డే అప్‌డేట్‌… ‘ 5 కేజీయ‌ఫ్‌ ‘ లు ‘ 10 త్రిబుల్ ఆర్‌ ‘ ల‌తో ఈక్వ‌ల్‌

భారతీయ సినీ నిర్మాణంలో ప్రస్తుతం రాబోతున్న అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో నాలుగు ప్రాజెక్టులు యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌వే ఉన్నాయి. రీసెంట్‌గా ఆదిపురుష్ సినిమా వ‌చ్చింది. త్వ‌ర‌లోనే స‌లార్‌.. సంక్రాంతికి కేజీయ‌ఫ్ ఆ త‌ర్వాత స్పిరిట్ ఆ త‌ర్వాత స‌లార్ 2 ఇలా వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టులు ప్ర‌భాస్ ద‌గ్గ‌ర ఉన్నాయి. అయితే స‌లార్‌, ప్రాజెక్ట్ కే సినిమాల మీద ఉన్న అంచ‌నాలు అయితే మామూలుగా లేవు.

ఇక గ‌త రెండు రోజులుగా ప్రాజెక్ట్ కే అంటే ఏంట‌న్న దానిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ క‌ర్ణ అని, ప్రాజెక్ట్ కురుక్షేత్ర అని ప్ర‌చారం జ‌రిగింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కాల‌చ‌క్ర అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే టైటిల్‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయ‌బోతున్నార‌ట‌.

ఇక ప్రాజెక్ట్ కే షూటింగ్ విషయానికి వ‌స్తే ఇప్పటికే ఈ సినిమా 90% షూటింగ్ ను పూర్తి చేసుకుంద‌ని తెలుస్తోంది. బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ కూడా కొన్ని వారాల్లో పూర్తి చేసేలా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. సినిమా అయితే ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కులను మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకువెళ్లేలా ఉంటుంద‌ని తెలుస్తోంది. సినిమా గురించి చెపుతోన్న వారి ప్ర‌కారం 5కేజీయ‌ఫ్‌లు, 10 త్రిబుల్ ఆర్‌ల‌తో ఈక్వ‌ల్‌గా .. ఇంకా చెప్పాలంటే అంత‌కు మించి ఉండేలా అవుట్ ఫుట్ వ‌చ్చిందంటున్నారు.

ప్రాజెక్ట్ కే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఏకకాలంలో జరిగేలా ప్లాన్ చేశారు. టీమ్ పెట్టుకున్న టైమ్‌ లైన్ ప్రకారం, విఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్, డిఐ, పోస్ట్ ప్రొడక్షన్ అంతా అక్టోబర్‌లో నెలాఖ‌ర‌కు పూర్తి కానుంది. ఓవ‌రాల్‌గా ప్రాజెక్ట్ కేను పాన్ -ఇండియా సినిమాగా మ‌లిచేందుకు నాగ్ అశ్విన్ విరోచితంగా క‌ష్ట‌ప‌డుతున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని రు. 600 కోట్ల‌ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.