ప్రముఖ డైరెక్టర్ వశిష్ట పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే సినిమా బింబిసారా.. ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా పరిచయమవుతూ ప్రముఖ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందించింది ఈ సినిమా. టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుంది అని అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
మరి ఏమైందో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా దర్శకుడు వశిష్ట కి కళ్యాణ్ రామ్ కి మధ్య గొడవలు జరిగాయి అని.. అందుకే బింబిసార 2 నుంచి వశిష్ట తప్పుకున్నారు అంటూ వార్తలు బాగా వినిపించాయి. అయితే ఈ గొడవలు రావడానికి కూడా కారణం లేకపోలేదు.. మెగాస్టార్ చిరంజీవి నుంచి వశిష్టకు ఫోన్ కాల్ రావడం.. ఇక కళ్యాణ్ రామ్ ను పక్కన పెట్టి చిరంజీవి వైపే వశిష్ట మొగ్గు చూపుతున్నాడు.
తనకు మొదటి ఆఫర్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ని కూడా పక్కనపెట్టి చిరంజీవి అవకాశం ఇవ్వడంతో వశిష్ట అటువైపు వెళ్లిపోయారు. దాంతో కళ్యాణ్ రామ్ కి కోపం వచ్చి ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందుకే ఇప్పుడు కళ్యాణ్ రామ్ బింబిసార 2 కి వశిష్ఠ తో కాకుండా ఇంకొక డైరెక్టర్ తో పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుండగా ఒకవైపు రెండో సినిమాగా వశిష్ట బింబిసారా 2 కాకుండా ఇంకో సినిమా చేస్తే కళ్యాణ్ రామ్ కి తన రెమ్యూనరేషన్ లో 40% ఇవ్వాలనే ఒప్పందం ఉందంట.. మరోవైపు వేరే దర్శకున్ని పెట్టుకొని సినిమా చేస్తే తనకి కూడా కొంత చెల్లించాలని వశిష్ట డిమాండ్ చేశారట. మరి దీన్ని వెంటనే పరిష్కరించుకొని సీక్వెల్ కి సిద్ధం చేయబోతున్నారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ సినిమాకి అనిల్ పాడూరి పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.