కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారింది అనుమప పరమేశ్వరన్. కర్లీ హెయిర్‌తో క్యూట్‌గా కనిపించే ఈ తార 18 పేజీస్ మూవీతో మరో హిట్ అందుకుంది. చాలా డీసెంట్ పాత్రలు చేసే ఈ అమ్మడు ప్రతీ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరుస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది. కార్తికేయ 2 తర్వాత అనుమపకి సినీ అవకాశాలు క్యూ కట్టాయి.
అయితే వచ్చిన అవకాశాల్లో మంచి స్టోరీలు ఉన్న వాటిని మాత్రమే ఒప్పుకుంది. వాటిలో తమిళ్ మూవీ సైరన్, మలయాళం మూవీ JSK ట్రూత్ షల్ ఆల్వేస్ ప్రివైల్, తెలుగులో టిల్లు స్క్వేర్, ఈగల్ సినిమాలు ఉన్నాయి. ఈ 4 సినిమాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న అనుపమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో రామ్ పోతినేనితో వచ్చిన అఫైర్స్ గురించి అనుపమ పెదవి విప్పింది.
వున్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాల్లో రామ్ తో కలిసి అనుపమ రొమాన్స్ చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ వారి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఆఫ్‌స్క్రీన్ లైఫ్‌లో కూడా వీరు చాలా క్లోజ్‌గా మెసులుతుంటారు. దాంతో వీరి మధ్య అఫైర్ నడుస్తున్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. కాగా ఇంటర్వ్యూలో రామ్‌తో అఫైర్ గురించి మాట్లాడేటప్పుడు అనుపమ చాలా ఎమోషనల్ అయింది. రామ్ తనకు ఓ మంచి ఫ్రెండ్ అని, అతనితో తనకు అఫైర్ ఉన్నట్లు పుకార్లు సృష్టించడం చాలా బాధగా ఉందని పేర్కొంది.
అయితే తాను గతంలో ఒక అబ్బాయిని ప్రేమించానని ఒప్పుకుంది. కానీ అతను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు కాదని, రూమర్స్ వచ్చినట్లు అతను క్రికెటర్ బుమ్రా కూడా కాదని స్పష్టం చేసింది. చాలా ఏళ్ల క్రితం ఒక అబ్బాయిని ప్రేమించానని కానీ వర్కౌట్ కాక బ్రేకప్ చేసుకున్నామని వెల్లడించింది. ఆ అబ్బాయి అనుపమ ఫస్ట్ లవ్ అని తెలుస్తోంది. మరి అతను ఎవరు అనేది మిస్టరీగానే మిగిలిపోయింది.