టాలీవుడ్ యంగ్‌రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. గత నెలలో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సెప్టెంబర్‌లో సలార్, సంక్రాంతికి ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక సెప్టెంబర్‌లో వస్తోన్న సలార్ సినిమాపై నేషనల్ వైడ్‌గా కనీవినీ ఎరుగని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి.
కేజీయఫ్ సీరిస్ సినిమాలతో నేషనల్ వైడ్‌గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు. ఇక సలార్ టీజర్ కూడా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే సలార్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ న్యూస్ అప్డేట్ వచ్చింది.
ఇక ఏపీ, తెలంగాణలో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రు. 200 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. నైజాం 72 కోట్ల – సీడెడ్ 35 కోట్లు – ఆంధ్ర 90 కోట్ల రూపాయలకి పైగా అమ్ముడైనట్టు సమాచారం. అయితే ఈ డీల్స్ చర్చల దశలో ఉన్నాయంటున్నారు. వీటిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది.
సలార్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా అందాల తార శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ థియేటర్లలోకి రానుంది.