స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల‌ను క్యూలో ఉంచిన స‌మంత ఇప్పుడు విజయ్‌తో రిక‌మెండ్ చేయించుకునే స్థితిలోనా..!

స‌మంత ఒక‌ప్పుడు తెలుగు సినిమాను నిజంగానే శాసించింద‌నే చెప్పాలి. ఆమె కాల్షీట్ల కోసం స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు, స్టార్ నిర్మాత‌లు కూడా క్యూలో ఉండేవారు. అస‌లు ఆమె ప‌ట్టింద‌ల్లా బంగారం.. ఆమె సినిమాలో ఉంటే బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్నంత రేంజ్ స‌మంత‌కు వ‌చ్చేసింది. అలాంటి స‌మంత ఎప్పుడు అయితే నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేసిదో అప్ప‌టి నుంచి ఆమె గ్రాఫ్ రోజు రోజుకు డౌన్ అవుతూ వ‌స్తోంది.

పోని విడాకుల త‌ర్వాత ఆమె నుంచి వ‌చ్చిన సినిమాలు పొడిచింది లేదు. య‌శోద యావ‌రేజ్‌. శాకుంత‌లం తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అతిపెద్ద డిజాస్ట‌ర్‌. ఇదో క‌ళాఖండంగా మిగిలిపోయింది. సీటాడెల్ వెబ్‌సీరిస్ కూడా క్లిక్ అవుతుంద‌న్న ఆశ‌లు లేవు. ఇక ఇప్పుడు ఆమె ఆశ‌లు అన్నీ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా న‌టిస్తోన్న ఖుషి సినిమా మీదే ఉన్నాయి.

ఈ సినిమా కూడా బాల్చిత‌న్నేస్తే అస‌లు స‌మంత‌ను ప‌ట్టించుకునే వారే ఉండ‌క‌పోవ‌చ్చు. ఓ వైపు మ‌హేష్‌, ప‌వ‌న్ లాంటి హీరోల‌కు స‌రైన హీరోయిన్లు దొర‌క్క వెతుక్కుంటున్నారు. అయితే వారెవ్వ‌రు అస్స‌లు స‌మంత వైపే చూడ‌డం లేదు. ఎవ్వ‌రూ దొర‌క్క‌పోతే కొత్త హీరోయిన్ అయినా పెట్టుకుంటున్నారే త‌ప్పా అస్సులు స‌మంత గురించి ప్ర‌స్తావ‌నే ఉండ‌డం లేదు.

ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ఖుషిసినిమా చేస్తోంది. విజ‌య్ నెక్ట్స్ సినిమాలో ఆల్రెడీ మృణాల్ ఠాగూర్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాలోనే మ‌రో హీరోయిన్ పాత్ర కోసం స‌మంత స్వ‌యంగా విజ‌య్ దేవ‌ర‌కొండతో రిక‌మెండ్ చేయించుకుంటోంద‌న్న గుస‌గుస‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఖుషి సినిమాకు కంటిన్యూగా విజ‌య్‌తో మ‌రో సినిమా చేసేసి ఆ త‌ర్వాత ఆమె సినిమాల‌కు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందంటున్నారు. దిల్ రాజు కూడా సమంత అయితే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నాడ‌ని.. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం ఓకే చెపితే వెంట‌నే స‌మంత విజ‌య్ ప‌క్క‌న మ‌రో సినిమాలో జాయిన్ అయిపోతుందంటున్నారు. ఏదేమైనా స‌మంత ఎక్క‌డ ఉండేది.. ఎక్క‌డ‌కు ప‌డిపోయిందే ఇదే పెద్ద నిద‌ర్శ‌నం.