ఆ స్టార్ హీరో సినిమాకు అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిందా… ఆ హీరో ఎవ‌రంటే..!

ప్రేమమ్‌ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్. త్రిస్సూర్‌ జిల్లా ఇరింజలకుడ గ్రామంలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ అ ఆ, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కార్తికేయ 2 సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో నటిస్తూ బిజీగా సమయం గడుపుతోంది.

ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తన పర్సనల్ విశేషాలను చాలానే పంచుకుంది. సినిమాల కోసమే ఇంటర్‌తో చదువు ఆపేశానని తెలిపింది. చికెన్ గారెలు తనకు ఎంతో ఇష్టమని కూడా వెల్లడించింది. రంగస్థలం సినిమాలో అవకాశం వచ్చి చేయి జారిపోయిందని ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చింది. పెయింటింగ్, సింగింగ్ తనకు ఇష్టమైన హ్యాబిట్స్ అని తెలిపింది. డైరెక్టర్‌గా మారాలనే ఆశ కూడా తనకు ఉందని చెప్పి ఆసక్తిని పెంచింది.

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వచ్చిన ‘మనియారయిలే అశోకన్‌(2019)’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పని చేశానని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇక తన లవ్ లైఫ్ గురించి మాట్లాడుతూ తాను ఒకరిని బాగా ఇష్టపడ్డానని అనుపమ తెలిపింది. చాలా ఏళ్ల క్రితం ఒక అబ్బాయిని బాగా ప్రేమించానని కానీ వర్కౌట్ కాక ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నామని, ఇది ఎప్పుడో జరిగిన సంగతి ఆమె తెలిపింది.

అయితే అనుపమ ఫస్ట్ లవర్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఆమె తన డేటింగ్ లైఫ్ గురించి వచ్చిన రూమర్స్ పై కూడా మాట్లాడింది. “బుమ్రా అని, రామ్‌ అని వారితో నేను డేటింగ్ చేస్తున్నానని రూమర్స్ వచ్చాయి కానీ అవన్నీ నిజం కాదు. వాళ్లు నాకు స్నేహితులు మాత్రమే” అని ఈ క్యూట్ హీరోయిన్ స్పష్టం చేసింది.