టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఈ వయస్సులోనే ఎంతోమంది ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార నుంచి ఏ ఫోటో వచ్చినా.. ఏ వీడియో వచ్చినా.. ఇట్టే వైరల్ అవుతుందంటే సితారకి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుస్తోంది. ఇప్పటికే భరతనాట్యంలో ప్రత్యేక శిక్షను తీసుకున్న సితార వాక్చాతుర్యంతో ఎన్నో అవకాశాలను దక్కించుకుని తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకుంది.
రీసెంట్‌గా ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా సితార సెలెక్ట్ అయింది. ఇంటర్నేషనల్ జ్యువెలరీ సంస్థ సితారతో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇందులో సితార లిటిల్ ప్రిన్స్ లా క్యూట్ స్మైల్ ఇస్తోంది. ఈ ఫొటోస్ అమెరికాలోని న్యూయార్క్ స్క్వేర్ బోర్డ్స్ పై మెరిసి సెన్షేషనల్ రికార్డు క్రియేట్ చేశాయి.
తాజాగా సితార నెక్ట్స్ మరో బిగ్ స్టెప్ తీసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ తన నెక్ట్స్ స్టెప్ ఏంటి? అనుకుంటున్నారా.. సితార ప్రస్తుతం మిస్ యూనివర్స్ లేదా మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో ఉందట. తన తల్లి నమ్రతా శిరోద్కర్ మాజీ మిస్ యూనివర్స్ కావడంతో ఆమె సలహా మేరకు దానికోసం ప్రాక్టీస్ చేస్తుందట.
నమ్రత కూడా సితారకి ఆ కాంపిటీషన్ కి తగ్గ శిక్షణ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇప్పటికే డ్యాన్స్ , వాక్చాతుర్యంతో పాటు మల్టీ టాలెంట్ తో ఆకట్టుకోగల టాలెంట్ ఉన్న సితార.. కచ్చితంగా మిస్ వరల్డ్ కిరీటానికి పోటీపడితే చాలా సెన్షేషనల్ అవుతుందన్న చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.