తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు అలనాటి నటి సావిత్రి. అయితే ప్రస్తుత తరం వారికి మహానటి అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు కీర్తి సురేష్. క్రేజీ దర్శకుడు నాగ్ అశ్విన్ తెర్కెక్కించిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో నటించి.. కాదు జీవించేసి ఈ తరం సావిత్రిగా స్థిరపడిపోయింది. అప్పటి వరకు కీర్తి సురేష్ నటించిన సినిమాలు వేరు అనేంత గొప్ప స్టార్‌డం ఆమె తెచ్చుకుంది.
మరీ ముఖ్యంగా ట్రెడిషనల్ బ్యూటీగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా దూసుకు వచ్చింది కీర్తి. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలు సక్సెస్ కాకపోవటంతో ఈమె కూడా గ్లామర్ విషయంలో తన హద్దులు మీరిపోతోంది. మహేష్ తో నటించిన సర్కారు వారి పాట సినిమాతో గ్లామర్ షోకు గేట్లు ఎత్తేసిన కీర్తి సురేష్ వరుస సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
ప్రస్తుతం కీర్తి సురేష్ ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందన్నది చూస్తే సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందట. కీర్తి తన మొదటి సినిమాకి మాత్రం ఎవరు ఊహించని రెమ్యూనరేషన్ అందుకుందట. కీర్తి సురేష్ మలయాళంలో ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత మలయాళంలో మూడు సినిమాలు చేసి తెలుగులోకి వచ్చింది.
అయితే కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాకి గాను తొలిసారిగా రూ.500 రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుందట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. కీర్తి సురేష్ రూ.500 స్థాయి నుంచి ఇప్పుడు రూ.5 కోట్ల స్థాయికి వచ్చిందంటూ ఆమె అభిమానులు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.