సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. అందుకు తగ్గట్టే చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి వారికి అవకాశాలు దొరకక ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆడిషన్‌కి వెళ్తే అవమానాలు ఎదురవుతాయి. అందంగా లేవని, హైట్ లేవని, తమ పాత్రకు తగ్గట్టు లేవని ఇలా వంకలు చెప్పి వెనక్కి పంపించేస్తారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
మిస్ వరల్డ్ అవ్వక ముందు కూడా ఇలాగే ఐశ్వర్యరాయ్ ఇబ్బందులు పడింది. ఆడిషన్‌కు వెళ్లి నిరాశతో తిరిగొచ్చేది. మిస్ వరల్డ్ అయిన తర్వాత అవకాశాలు ఆమె ముందు వాలాయి. ఐశ్వర్యరాయ్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలు దాదాపు అందరు హీరోయిన్లకు ఎదురవుతాయి. ఇదే తరహాలో తనకు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ పేర్కొంది. ఏకంగా తన శరీర భాగాలపైనే కామెంట్లు చేశారని వాపోయింది.
కావ్య కళ్యాణ్ రామ్ అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ బలగం మూవీ హీరోయిన్ అనగానే టక్కున గుర్తు పడతారు. ఇక ఆమె గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత హీరోయిన్గా ఆమె మసూద సినిమా చేసింది. అందులో ఆమెది చిన్న పాత్ర. దీంతో సినిమా హిట్ అయినా పెద్దగా పేరు రాలేదు. అయితే ఆ తర్వాత వేణు ఎల్దండి దర్శకత్వంలో చేసిన బలగం సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా 1000 అవార్డులు ఈ సినిమాకు వచ్చాయి. క్రమంగా ఆమెకు సినీ అవకాశాలు పెరగడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అనుభవాలను ఆమె పంచుకుంది. తాను చాలా ఆడిషన్స్‌కి వెళ్లి అవమానాలకు గురయ్యానని చెప్పింది. ఓ ఆడిషన్లో తన బా… సైజు పెద్దగా ఉందని.. అవి సరిచేసుకోకపోతే తాను హీరోయిన్ మెటీరియల్ కాదని అన్నట్లు పేర్కొంది. ఇలా తనను బా… షేమింగ్ చేసినా తన ప్రయత్నాలు ఆపలేదని ఆమె తెలిపింది.