ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల హడావిడి బాగా నడుస్తోంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా దగ్గర హాట్ టాపిక్ గా నడుస్తున్న రెండు టాప్ మోస్ట్ చిత్రాలు మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వే కావడం విశేషం. ఆ రెండు సినిమాలు ఏంటో కాదు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ – ప్రాజెక్ట్ కే సినిమాలు.
ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు ఏ అప్‌డేట్ వచ్చినా కూడా ఫ్యీజులు ఎగిరిపోయేలా సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇక ప్రాజెక్ట్ కే సినిమాను టాలీవుడ్ సీనియర్ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కే అని ముందు నుంచి చెపుతున్నా అసలు ప్రాజెక్ట్ కే అంటే ఏంటన్న మీనింగ్ మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు.
అసలు ఈ సినిమా టైటిల్ ఏంటన్నది ముందు నుంచి పెద్ద సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కే అంటే “ప్రాజెక్ట్ కల్కి” అనేది బాగా హైలైట్ అయ్యింది. ఈ సినిమా కాన్సెప్ట్ అనుగుణంగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ వైరల్ అవుతోంది. ప్రాజెక్ట్ కే అంటే “ప్రాజెక్ట్ కాలచక్ర” అంటున్నారు. ఈ టైటిల్ అంటే నిజంగా గూస్‌బంప్స్ మోత మోగిపోవాల్సిందే.
ఈ సినిమా కథకు కాలానికి లింక్ ఉంటుంది. గతంలో బాలయ్య ఆదిత్య 369 సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సినిమాలో కూడా గతం, వర్తమానం, భవిష్యత్తు కాలాలతో కథ నడుస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కాలచక్ర అనగానే పాన్ ఇండియాకు మాత్రమే కాదు వరల్డ్ వైడ్‌గా అది యూనివర్సిల్ టైటిల్ అవుతుందనడంలో సందేహం లేదు.
ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తోన్న ఈ సినిమాలో దిశా పటానీ రెండో హీరోయిన్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్, కమల్‌హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.