పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న సినిమా బ్రో. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోదయం సితం సినిమాకు రీమేక్‌గా బ్రో వస్తోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హీరో, దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ డివోషనల్ ఎంటర్టైనర్ బ్రో ది అవతార్.
ఈ సినిమా టీజర్ వదిలాక వచ్చిన మంచి అంచనాలు అలా క్యారీ అవుతూ వస్తుండగా సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అంతా వేయి కళ్లతో వెయిట్ చేస్తూ వచ్చారు. ఇక నిన్న ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఎంతో ఎగ్జైట్‌గా వెయిటింగ్ చేసిన పవన్ ఫ్యాన్స్‌కు ఈ ఫస్ట్ సింగల్ అంత కిక్ ఇవ్వలేదనే అంటున్నారు.
సాంగ్ మొత్తం మీద ఒక్క పవన్ లుక్స్ వరకు సాంగ్ లో హైలైట్ అయ్యాయి. అయితే వినడానికి వెంటనే చార్ట్ బస్టర్ రేంజ్ లో అయితే ఈ సాంగ్ లేదనే చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. పవన్ పూర్తిగా నిరాశ పరిచాడనే పవన్ వీరాభిమానులు సైతం అంగీకరిస్తున్నారు. పవన్ థమన్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో పోలిస్తే ఇది అంత కిక్ ఇవ్వలేదనే అంటున్నారు.
త్రివిక్రమ్ ముందు నుంచి థమన్‌కు బాగా అలుసు ఇవ్వడంతో పెద్ద దెబ్బ పడిపోయిందనే అంటున్నారు. అసలు గుంటూరు కారం సినిమాకే థమన్‌ను మార్చేయాలని మహేష్ పట్టుబట్టినా త్రివిక్రమ్ కన్విన్స్ చేయడంతో మహేష్ వెనక్కు తగ్గాడు. ఏదేమైనా త్రివిక్రమ్‌ను పవన్ ఫుల్లుగా నమ్మితే పెద్ద రాడ్ దింపేసి బ్రోపై నమ్మకాలు పోయేలా చేశాడని పవన్ అభిమానులే ముక్కున వేలేసుకుంటున్నారు.