బిగ్ బ్రేకింగ్: వైఎస్ షర్మిళ కొడుకు హీరోగా లాంచ్‌… డైరెక్టర్ ఎవరంటే..!

చిత్ర పరిశ్రమలో హీరోగా వెలగాలని ఎంతోమందికి ఆశ ఉంటుంది. అయితే ఆ అదృష్టం మాత్రం కొందరికే దక్కుతుంది. మరి ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో దర్శకులుగా, నిర్మాతలుగా, హీరోలుగా వెలుగుతున్న వారు తమ కుటుంబంలో ఉన్న వారిని హీరోలుగా చిత్ర పరిశ్రమకు తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమా ప‌రిశ్ర‌మ‌తో సంబంధం లేకుండా బాగా పేరు, డబ్బు సంపాదించిన వారు కూడా తమ పిల్లలను హీరోలుగా పరిచయం చేస్తున్నారు.

అలా రాజకీయాల్లో ఉన్నవారు కూడా ఈ రీసెంట్‌ టైమ్స్ లో త‌మ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తున్నారు. అలా వారి సినిమాలకు వారే పెట్టుబడి పెడుతూ ఓ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది రాజకీయ నాయకుల పిల్లలు ఇప్పటికే చిత్ర పరిశ్రమలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా దివంగత మాజీ ముఖ్య‌మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల కొడుకు హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

ఏదో మిగిలిన వారిలా కాకుండా చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరో అయ్యేలా షర్మిళ‌ తన కొడుకు రాజారెడ్డిని హీరోగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే కుటుంబ సభ్యులు మొత్తం ఓ డెసిషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ కుర్రాడిని హీరోగా లాంచ్ చేసే దర్శకుడు పూరి జగన్నాథ్ అంటున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ ఒక క‌థ‌ను కూడా రెడీ చేశారట.

ఆ క‌థ‌ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని.. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ని పూరి ఎలా ? లాంచ్ చేశారో.. అలాగే షర్మిళ‌ కొడుకు రాజారెడ్డిని కూడా లాంచ్ చేసే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. రాజారెడ్డిని ఇప్పటికే హీరోగా అవడానికి అన్ని రకాల ట్రైనింగ్‌లు అమెరికాలో తీసుకున్నారని అంటున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో ఇప్పుడున్న స్టార్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో రాజారెడ్డి కటౌట్ అదిరిపోయింది.