నిహారిక బుద్ధి ఎలాంటిదో పెళ్లికి ముందే చైత‌న్య‌కు తెలుసా…. ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా..!

జొన్నలగడ్డ చైతన్య – నిహారిక‌ గత కొంతకాలంగా ఈ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలకు తెరదించుతూ వీరిద్దరు విడాకుల పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారని కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు తాజాగా వీరిద్దరి గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లి చేసుకుంటే నిహారికతో కష్టం అంటూ చైతన్యను ముందుగానే ఒక మెగా హీరో హెచ్చరించారన్న‌ వార్తలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దీంతో ఆ మెగా హీరో అనే ఆసక్తి సినీ అభిమానుల్లో పెరిగిపోయింది. జొన్న‌ల‌గ‌డ్డ చైతన్య తండ్రి ప్రభాకర్ రావు, చిరంజీవి మంచి స్నేహితులు కావడంతో వీరిద్దరూ కలిసి చైతన్య – నిహారికల విషయం గురించి మాట్లాడుకుని నిశ్చితార్థానికి ఓకే చేశారు. అనంతరం నిహారిక – చైతన్య వివాహం చేసుకున్నారు.

నిశ్చితార్థం జరిగిన తరువాత కాబోయే బావ‌బావ‌మ‌రుదులు అయిన‌ వరుణ్ తేజ్, చైతన్య మంచి స్నేహితులయ్యారట. ఆ సమయంలో వరుణ్ తేజ్ చైతుతో మాట్లాడుతు నిహారికతో చాలా కష్టమని.. ఆమె ఇక్కడ స్వతంత్రంగా పెరిగిన అమ్మాయి… ఇంట్లో వారు కూడా తనపై ఉన్న ప్రేమతో తను ఎలా ?నడుచుకున్నా ఏం మాట్లాడే వారు కాదు. ఇక్కడ తను చాలా గారాబంగా పెరిగింద‌ని చెప్పాడ‌ట‌.

అలాగే తన అల్లరి తన గోలను మీరు భరించలేరు.. పెళ్లి తర్వాత ఆ అల్లరి గోల అంతా మీరే భరించాల్సి ఉంటుంది. తనని భరించడం చాలా కష్టం చైతన్య అంటూ హెచ్చరించాడట వరుణ్ తేజ్. ఇక చైతన్య – నిహారిక పెళ్లయిన కొంతకాలానికే నిహారిక వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ లేదని.. ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. చివ‌ర‌కు అవి విడాకుల వ‌ర‌కు వెళ్లాయి. నిహారిక – చైతన్య పెళ్లైన రెండు సంవత్సరాలోపే విడాకులు తీసుకోవడంతో మెగా ఫాన్స్ షాక్ అవుతున్నారు.