పుష్ఫ-2 ఐటమ్ సాంగ్‌.. ఊర్వశి రౌతెలా అడిగిన రెమ్యున‌రేష‌న్‌తో క‌రెంట్ షాక్‌…!

సినిమాలకు స్పెషల్ సాంగ్ ప్రత్యేకతను తీసుకొస్తుంది. ముఖ్యంగా భారతీయ సినిమాలలో చాలా వాటిలో ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. అయితే ఇందులో నటించే వారంటే గతంలో చులకన భావం ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. స్టార్ హీరోయిన్లు సైతం ఐటమ్ సాంగ్స్‌లో చేస్తున్నారు. వీటిని ఇటీవల కాలంలో స్పెషల్ సాంగ్‌గా పిలుస్తున్నారు. ఓ పాట షూటింగ్ 5 నుంచి 7 రోజులలో పూర్తి అవుతుంది.

అదే సినిమా అయితే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు జరుగుతుంది. ఒక సినిమాకు చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ ఒక స్పెషల్ సాంగ్‌కు వచ్చేస్తుంది. దీంతో స్టార్ హీరోయిన్లు సైతం ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదే కోవలో సమంత పుష్ప 1లో ఊ అంటావా మావ సాంగ్ చేసింది. దీనికి ఆమె రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ భామ అంతకు మించి అడుగుతుందనే వార్త సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఈ అమ్మడు అడపాదడపా తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. దానికి ఆమె రూ.1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం ఇటీవల ఆమెను చిత్ర బృందం సంప్రదించిందట. అయితే ఆమె చెప్పిన అమౌంట్ విని మూవీ టీమ్‌కు కళ్లు తిరిగినట్లైందట. వాల్తేరు వీర‌య్య ఐటెం సాంగ్ కోసం తీసుకున్న అమౌంట్‌కు డ‌బుల్ రేటు చెప్పింద‌ట‌.

అయితే ఈ అమ్మడికి అంత సీన్ ఉందా అని తెలుగు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదేమైనా పుష్ప 2 సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠ ఉంది. మొదటి పార్ట్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై ఆ సినిమా సంచలన విజయం సాధించింది.